దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు రోజు రోజుకూ దిగజారి పోతున్నాయి.ఈ క్రమంలోనే రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటికలో స్థలం లేకుండా పోతుందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా నదులలో మృతదేహాలు కొట్టుకు రావడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తోంది.గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకురావడం బిహార్‌లోని బక్సర్ జిల్లాలో కలకలం రేపింది. మహదేవ్ ఘాట్ వద్ద కిలోమీటర్ల పరిధిలో సుమారు 50కి పైగా మృత దేహాలు కొట్టుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కరోనా బారినపడి మృతి చెందినవారి అంత్యక్రియలను నిర్వహించకుండా ఈ విధంగా నదిలో పడేస్తున్నట్లు పోలీసులు భావించారు. వారం రోజుల నుంచి మహాదేవ్ ఘాట్ వద్ద డజన్ల కొద్ది సేవలు కొట్టుకు రావడంతో ఆ శవాలను రాబందులు, కుక్కలు పీక్కు తింటున్నాయి.
కొందరు మహదేవ్ ఘాట్, చౌసా, మిశ్రావలియాచుట్టుపక్కల గ్రామాల నుంచి అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ ఉన్న దృశ్యాలను చూసి అంతక్రియలు నిర్వహించకుండా వెనక్కి వెళ్తున్నారని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా కరోన బారినపడి కనీసం అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా ఆ శవాలను గంగానదిలో పడటం వల్ల కుక్కలు, రాబందులు పీక్కు తినడం చూస్తుంటే మన దేశంలో కరోనా ఏవిధంగా ప్రళయం సృష్టిస్తుందో అర్థమవుతోంది. కనుక ఈ మహమ్మారి నుంచి బయట పడటానికి మార్గం తగిన జాగ్రత్తలు పాటించడమేనని అధికారులు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…