మద్యం తాగుతున్నారా… అయితే ఈ వ్యాధి తప్పదు?

మీరు మద్యం ప్రియుల.అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.మీరు మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే మీపై దుష్ప్రభావాల తీవ్రత అంతగా పెరుగుతుంది.ప్రస్తుత రోజుల్లో పార్టీలు చేసుకోవడం, పబ్బులకెళ్లడం,మద్యం సేవించడం వంటివి మన జీవితంలో సర్వసాధారణమైపోయాయి.మద్యం సేవించడం వల్ల ఆల్కహాల్ దుష్ప్రభావం మనపై వివిధ దశల్లో ప్రభావం చూపి అనేక రకాల వ్యాధులకు కారణం అవుతుంది.ముఖ్యంగా అనేక రకాల క్యాన్సర్లకు మద్యం సేవించడం కూడా కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది.

అధ్యయనం ప్రకారం మద్యం సేవిస్తున్న వారిలో కేన్సర్ వ్యాధి బారినపడిన వారి సంఖ్య గతేడాది ప్రపంచవ్యాప్తంగా 7,41,300 మంది. కేన్సర్ రోగుల్లో మద్యం వలన దీని బారిన పడిన వారు 4 శాతం.అంటే ప్రతి 25 మంది కేన్సర్ రోగుల్లో మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారని,వీరిలో ఎక్కువ మంది కాలేయ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, రొమ్ము కేన్సర్ కేసులే ఎక్కువ ఉన్నాయని సర్వే వెల్లడించింది.

ఈ జాబితాలో మంగోలియా మొదటి స్థానంలో ఉండగా, బ్రిటన్ 38 వ స్థానంలోఉంది. అతి తక్కువ కేసులతో కువైట్‌లో ఉన్నాయట. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందట.అతిగా మద్యం సేవించడం వల్ల మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిదానికీ ఒక పరిమితి అంటూ ఉంటుంది. అలాగే మద్యం సేవించడంలో కూడా పరిమితికి మించితే అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు అని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు.