Tag Archives: health problems

Jabardasth Vinodini: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జబర్దస్త్ వినోదిని..ఆ వ్యాదే కారణమా?

Jabardasth Vinodini: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో వినోద్ ఒకరు. ఈయన వినోదిని అనే లేడీ గెటప్స్ వేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.

ఇకపోతే ఇటీవల కాలంలో జబర్దస్త్ వినోద్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇలా ఈ కార్యక్రమానికి దూరం అవడానికి గల కారణాలు తెలియలేదు అయితే చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వినోద్ జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అవడానికి గల కారణాలను తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయనని చూస్తే ఇక్కడ ఉన్నది వినోదేనా అనే సందేహం అందరికీ కలగక మానదు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయారు పూర్తిగా బక్క చిక్కి ఉన్నటువంటి ఈయన తన అనారోగ్యం కారణంగానే ఇలా మారిపోయానని తెలిపారు తాను ఉన్నఫలంగా శరీర బరువు కోల్పోయారని తెలిపారు. పెద్దగా ఈ విషయం గురించి తాను పట్టించుకోలేదని కానీ ఒక నెలలో తాను ఎక్కువగా బరువు తగ్గడంతో టెస్టులు చేయించుకున్నారని దాంతో తనకు ఊపిరితిత్తులలో నీరు చేరి ఇన్ఫెక్షన్ అయ్యిందని తెలిపారు.

ఊపిరితిత్తుల సమస్య
ఈ విషయం తెలిసే నేను రెండు సంవత్సరాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. ఇలా ఎలాంటి షోలు లేకుండా ట్రీట్మెంట్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను అని అయితే జబర్దస్త్ మాజీ జడ్జి మంత్రి రోజా తనకు అండగా నిలబడ్డారని తెలిపారు. అయితే ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కాస్త స్థిమితంగా ఉందని షోలలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయని త్వరలోనే తాను తిరిగి అందరి ముందుకు రాబోతున్నాను అంటూ వినోద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Punch Prasad: సర్జరీ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన జబర్దస్త్ పంచ్ ప్రసాద్… ఎమోషనల్ అయిన కమెడియన్!

Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కమెడియన్ పంచ్ ప్రసాద్. ఈయన అద్భుతమైన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ప్రతి ఒక్కరిని కడప నవ్విస్తూ ఉంటారు. ఇలా పైకి నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండే పంచ్ ప్రసాద్ నవ్వు వెనక ఎన్నో కన్నీటి గాథలు కష్టాలు ఉన్నాయని చెప్పాలి. ఈయన పైకి నవ్వుతూ కనిపించిన ఆరోగ్యం పరంగా తాను ఎంతో నరకం అనుభవించారు అనే విషయం మనకు తెలిసిందే.

రెండు కిడ్నీలు పాడవడంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పంచ్ ప్రసాద తన ఆరోగ్య సమస్యలను కూడా పక్కనపెట్టి ప్రేక్షకులను సందడి చేయడానికి వేదిక పైకి వచ్చేవారు అయితే ఈయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడంతో ఈయనని పరీక్షించిన వైద్యులు తనకు వెంటనే సర్జరీ జరగాలని సూచించారు. ఈ విధంగా పంచ్ ప్రసాద్ కిసర్జరీ చేయాలని చెప్పడంతో నూకరాజు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు.

Punch Prasad: ఎమోషనల్ అయిన ప్రసాద్..


ఇక ఈ విషయం జబర్దస్త్ మాజీ జడ్జ్ ఏపీ మినిస్టర్ రోజా వరకు చేరడంతో ఈమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ప్రసాద్ సర్జరీకి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఇలా సర్జరీ సక్సెస్ అయిన తరువాత ప్రసాద్ దాదాపు మూడు నెలలపాటు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు అయితే ఈయన ఆరోగ్యం కుదట పడటంతో తిరిగి బుల్లితెరపై సందడి చేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసినటువంటి ఈయన తన పరిస్థితిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Samantha: సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న సమంత… కారణం అదేనా?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత ఈమె పూర్తిగా తన దృష్టిని కెరియర్ పై పెట్టారు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అయిన తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు.

ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో నటిస్తున్నారు. అలాగే సిటాడల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు ఈ రెండు కూడా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చాయి అయితే ఈ రెండు షూటింగ్ పూర్తి అయిన తర్వాత సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సమంత ఇలా కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావించారట. అయితే ఈమె ఎందుకు సినిమాలకు దూరం అవ్వాలనుకుంటున్నారు అనే విషయానికి వస్తే గతంలో మయోసైటిస్ బారిన పడిన సమంతకు ఈ వ్యాధి మళ్లీ తిరగబడిందని అందుకే ఈమె కమిట్ అయిన సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇస్తుందని సమాచారం.

Samantha: మరోసారి అనారోగ్యానికి గురయ్యారా…


ఇలా మయోసైటిస్ తిరగబడటంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి పూర్తిగా ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని భావించారట అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీన్నిబట్టి చూస్తుంటే సమంత ఆరోగ్యం గురించి మరోసారి తాను అప్డేట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇలా సమంత తన ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు ముందుగానే చెప్పడంతో తన గురించి ఎలాంటి పుకార్లు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.

Punch Prasad: మరింత విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం… దాతల సాయం కోసం ఎదురుచూపులు?

Punch Prasad: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను కడుపుబ్బ నవ్వించారు. ఇలా కమెడియన్ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన గత కొంతకాలంగా తన రెండు కిడ్నీలో ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా ప్రసాద్ రెండు కిడ్నీలో ఫైల్ అవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటూ కిడ్నీ దాతల కోసం ఎదురుచూశారు. అయితే తనకు కిడ్నీ దొరికింది అంటూ ఒకానొక సమయంలో తన భార్య సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నూకరాజు సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ ఆరోగ్యం గురించి తెలియజేశారు.

రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రసాద్ అన్న కిడ్నీ ఫెయిల్యూర్స్ కారణంగా మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా తనని వెంటాడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుందని లేకపోతే ఏ క్షణం అయినా ఏదైనా జరగవచ్చు అంటూ డాక్టర్లు చెప్పారని నూకరాజు తెలిపారు.

Punch Prasad: ఫోన్ పే చేయవచ్చు..


ఇక డాక్టర్లు సర్జరీ చేయాలి అంటే భారీగా డబ్బు అవసరం అవుతుంది అందుకోసమే ఎవరైనా డబ్బు సహాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నామని నూకరాజు తెలిపారు. అంతేకాకుండా ఈయనకు ఎవరైనా తనకు ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే ఫోన్ పే నెంబర్ కి చేయొచ్చు అంటూ నెంబర్ ఇవ్వడమే కాకుండా తన భార్య బ్యాంక్ డీటెయిల్స్ అని కూడా ఈ వీడియోలో జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Actor Sudhakar: రూమర్లపై స్పందించిన నటుడు సుధాకర్… తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ కామెంట్స్!

Actor Sudhakar: సీనియర్ నటుడు సుధాకర్ ఆరోగ్యం గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఈయన ఆరోగ్యం ఏ మాత్రం బాగాలేదని ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అంటూ తరచూ నటుడు సుధాకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే ఈ వార్తలను నటుడు సుధాకర్ ఎన్నోసార్లు ఖండించిన ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.

సోషల్ మీడియా పుణ్యమా అని బ్రతికి ఉన్నటువంటి సెలబ్రిటీలను కూడా చంపేస్తున్నారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు బ్రతికుండగానే మరణించారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరికి ఈ వార్తల పై సెలబ్రిటీలు స్పందిస్తూ తాము బ్రతికే ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఈ క్రమంలోనే నటుడు సుధాకర్ ఆరోగ్యం గురించి కూడా ఎన్నో వార్తలు వచ్చాయి గతంలో కూడా ఈయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని మరణించారంటూ కూడా వార్తలు వచ్చాయి.అయితే ఇలా తన గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో రూమర్లు స్ప్రెడ్ అయినా సుధాకర్ స్పందిస్తూ ఆ వార్తలను ఖండిస్తూ ఉంటారు.

Actor Sudhakar: అసత్యపు వార్తలను స్ప్రెడ్ చేయకండి…


ఈ క్రమంలోనే తాజాగా సుధాకర్ అనారోగ్యం క్షీణించిందని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ ఈయన ఆరోగ్యం గురించి ఎన్నో రకాల వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై సుధాకర్ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, నా ఆరోగ్యం గురించి వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమని అందులో నిజం లేదని ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి వచ్చే వార్తలను ఖండిస్తూ ఈయన చేసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

https://telugudesk.net/wp-content/uploads/2023/05/WhatsApp-Video-2023-05-25-at-12.25.38-PM.mp4
WhatsApp-Video-2023-05-25-at-12.25.38-PM.mp4

Actor Rana: కుడి కన్ను అస్సలు కనిపించదు… కిడ్నీ మార్పిడి జరిగింది… ఆరోగ్య సమస్యలను బయటపెట్టిన రానా!

Actor Rana: ఇండస్ట్రీలో దగ్గుబాటి వారసుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రానా గురించి అందరికీ సుపరిచితమే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్న రానా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు.

ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇకపోతే గత కొద్ది రోజులుగా రానా ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రానా అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

గతంలో ఒకసారి తనకు కంటి సమస్య ఉందని చెప్పిన రానా తాజాగా మరోసారి తన సమస్య గురించి ఓపెన్ అయ్యారు. తనకు చిన్నప్పటి నుంచి కుడి కన్ను అసలు కనిపించదని రానా ఈ సందర్భంగా మరోసారి వెల్లడించారు. తనకు చిన్నప్పుడే ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి సర్జరీ జరిగిందని రానా తెలిపారు. అదేవిధంగా కిడ్నీ మార్పిడి కూడా జరిగింది అంటూ రానా ఈ సందర్భంగా వెల్లడించారు.

Actor Rana: నేను టెర్నినేటర్‏ని

ఈ విధంగా కన్ను, కిడ్నీ రెండింటికీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ విషయంలో నేను టెర్నినేటర్‏ని అనుకుంటున్నాను. చాలా మంది శారీరక సమస్యలు వస్తే బాధపడుతుంటారు. ఆ సమస్యలు నయమైన బాధపడుతూ ఉంటారు.అయితే అలా ఎప్పుడూ ఉండకూడదని ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి ముందుకెళ్లాలంటూ ఈ సందర్భంగా రానా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ధైర్యం చెప్పారు. మొత్తానికి ఈయన ఆరోగ్య సమస్యలను గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Renu Desai: రేణు దేశాయ్ అలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతోందా… వైరల్ అవుతున్న పోస్ట్!

Renu Desai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు.ఇండస్ట్రీలో హీరోయిన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రేణు దేశాయ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా ఈమె హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా దర్శకరాలిగా కూడా పేరుపొందారు.

ఇక పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తన పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తున్నారు. ఇలా తరచూ తన పిల్లలకు సంబంధించిన విషయాలతో పాటు హాలిడే వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటించే రేణు దేశాయ్ తాజాగా తాను ఓ వ్యాధితో బాధపడుతున్నానంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించారు.

ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా రేణు దేశాయ్ సైతం తాను కూడా ఓ వ్యాధితో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తన సమస్యను బయటపెట్టారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ స్పందిస్తూ శ్రేయోభిలాషులు మీకు ఓ విషయం చెప్పాలి. గత కొన్ని ఏళ్ల నుంచి తాను గుండె ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని ఈమె తెలియజేశారు.

Renu Desai: ధైర్యం కోల్పోవద్దు…

ఇలాంటి సమస్యలతో బాధపడుతూ బలం తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టు అనిపించింది. నేను మాత్రమే కాదు నాలా బాధపడే వారందరూ కూడా బలంగా నిలబడాలని ఎవరు నిరుత్సాహంతో ఉండకుండా, పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండడం కోసమే ఈ పోస్ట్ చేస్తున్నాను.మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్న ధైర్యం కోల్పోకూడదు అంటూ ఈమె తన సమస్యను బయట పెట్టడమే కాకుండా ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Breaking: అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన సూపర్ స్టార్ కృష్ణ.. అసలు ఏం జరిగిందంటే?

Breaking: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఈయనను మెరుగైన చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. కృష్ణ గత కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేటి ఉదయం ఈయనకు ఈ సమస్య మరింత తీవ్రం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు తననీ మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Super Star Krishna: 12 ఫ్లాపులు రావడంతో హీరో పనికిరానని పక్కన పెట్టారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణ!

ఈ విధంగా కాంటినెంటల్ హాస్పిటల్లో కృష్ణ చేరడంతో వైద్యులు తనకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు.ప్రస్తుతం ఈయన ఆరోగ్య విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు తెలియడంతో ఎంతో మంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తన ఆరోగ్యం స్థిమితంగా ఉండాలని తన క్షేమంగా బయటకు రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Breaking

ఇక గత కొద్ది రోజుల క్రితం కృష్ణ తన సతీమణి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే తన భార్య మరణించడంతో కృష్ణ ఎంతగానో కుమిలిపోయారని తద్వారా ఈయన కూడా అనారోగ్య సమస్యలకు గురయ్యారని తెలుస్తోంది.ఈయన ఆరోగ్య పరిస్థితి తీవ్రతరం కావడంతో హాస్పిటల్ కి తరలించారు.

Krishnam Raju: కృష్ణంరాజు అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో చేయడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?

Krishnam Raju: సినీ నటుడు రాజకీయ నాయకుడు మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణించడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సినీ తారలు మొత్తం తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇకపోతే సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలను మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో నిర్వహించారు.

ముందుగా కృష్ణంరాజు గారి అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఈయన అంత్యక్రియలు మాత్రం కనకమామిడి ఫామ్ హౌస్ లో అధికారక లాంచనాలతో నిర్వహించారు. అయితే ఇలా అంత్యక్రియలను ఫామ్ హౌస్ లో నిర్వహించడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది.కృష్ణంరాజు ఎంతో ఇష్టపడి ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని త్వరలోనే ఇక్కడ తన అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకొని ఇక్కడే నివాసం ఉండాలని భావించినట్లు తెలుస్తోంది.

ఇలా ఈయన బ్రతుకున్న సమయంలో తాను మరణిస్తే అదే ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు చేయాలని తన ఇంటిని చూసుకుంటూ అక్కడే ఉంటానంటూ పలుసార్లు వెల్లడించారట.ఇలా బ్రతికున్న సమయంలో తన అంత్యక్రియలు అక్కడే చేయాలని తన పెదనాన్న కోరడంతో ప్రభాస్ చివరి క్షణంలో తన అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ నిర్వహించారు.

Krishnam Raju: కృష్ణంరాజు కోరిక మేరకే అంత్యక్రియలు..

ఇలా కృష్ణంరాజు కోరిక ప్రకారమే ఆయన అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో నిర్వహించారు ప్రభాస్ చేతుల మీదుగా కాకుండా తన సోదరుడు ప్రబోద్ చేతులమీదుగా కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. కృష్ణంరాజు గారికి కుమారులు లేకపోవడంతో తన సోదరుడు కుమారుడైన ప్రబోద్ చేతులమీదుగా జరిగాయి. కృష్ణంరాజు గారికి ముగ్గురు కుమార్తెలు అనే విషయం మనకు తెలిసిందే.

Krishnam Raju: ఆ విషయంలో నేను ఎప్పటికీ రిచ్ స్వయంగా ఒప్పుకున్న కృష్ణంరాజు.. వైరల్ అవుతున్న కామెంట్స్!

Krishnam Raju: టాలీవుడ్ రెబల్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈయన గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో మృతి చెందారు.

ఇలా కృష్ణంరాజు మరణించారన్న వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో పలువురు సినీ ప్రముఖులు తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆయనకు నివాళులు అర్పించారు.ఇకపోతే గతంలో కృష్ణంరాజు పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే కృష్ణంరాజు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ ఒక విషయంలో తాను ఎప్పటికీ రిచ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజు ఎంతో సంపన్నుల కుటుంబంలో జన్మించారు. అయితే తాను ఆస్తులు విషయంలో రిచ్ కాదని మనసు విషయంలో చాలా రిచ్ అంటూ గతంలో కృష్ణంరాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాను సినిమాలలో సంపాదించినది మొత్తం దాచి పెట్టకుండా ఎక్కువ భాగం ఖర్చులు చేసే వాణ్ణి అంటూ ఈయన తెలిపారు.

Krishnam Raju: సంపాదనలో ఎక్కువ భాగం ఖర్చుపెట్టేవాడిని…

తాను ఇంటి నుంచి స్టూడియోకు వెళ్లే వరకు మాత్రమే కృష్ణంరాజు ఒకసారి మేకప్ వేసుకున్నాను అంటే ఈ ప్రపంచంతో తనకు పని ఉండదని ఈయన తెలిపారు. ఇక తనకు పేకాట ఆడడం, మందు కొట్టడం కూడా అలవాటుగానే ఉన్నాయని అయితే ఎప్పుడూ కూడా లిమిట్ దాటదు అంటూ ఈయన వెల్లడించారు.ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారాలలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని అయితే లాభనష్టాలు గురించి ఆలోచించుకోకుండా వ్యాపారాలు చేస్తూ ఉండేవాడిని అంటూ గతంలో కృష్ణంరాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.