Categories: FeaturedMovie News

Krishnam Raju: కృష్ణంరాజు అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో చేయడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?

Krishnam Raju: సినీ నటుడు రాజకీయ నాయకుడు మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణించడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సినీ తారలు మొత్తం తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇకపోతే సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలను మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో నిర్వహించారు.

ముందుగా కృష్ణంరాజు గారి అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఈయన అంత్యక్రియలు మాత్రం కనకమామిడి ఫామ్ హౌస్ లో అధికారక లాంచనాలతో నిర్వహించారు. అయితే ఇలా అంత్యక్రియలను ఫామ్ హౌస్ లో నిర్వహించడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది.కృష్ణంరాజు ఎంతో ఇష్టపడి ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని త్వరలోనే ఇక్కడ తన అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకొని ఇక్కడే నివాసం ఉండాలని భావించినట్లు తెలుస్తోంది.

ఇలా ఈయన బ్రతుకున్న సమయంలో తాను మరణిస్తే అదే ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు చేయాలని తన ఇంటిని చూసుకుంటూ అక్కడే ఉంటానంటూ పలుసార్లు వెల్లడించారట.ఇలా బ్రతికున్న సమయంలో తన అంత్యక్రియలు అక్కడే చేయాలని తన పెదనాన్న కోరడంతో ప్రభాస్ చివరి క్షణంలో తన అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ నిర్వహించారు.

Krishnam Raju: కృష్ణంరాజు కోరిక మేరకే అంత్యక్రియలు..

ఇలా కృష్ణంరాజు కోరిక ప్రకారమే ఆయన అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో నిర్వహించారు ప్రభాస్ చేతుల మీదుగా కాకుండా తన సోదరుడు ప్రబోద్ చేతులమీదుగా కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. కృష్ణంరాజు గారికి కుమారులు లేకపోవడంతో తన సోదరుడు కుమారుడైన ప్రబోద్ చేతులమీదుగా జరిగాయి. కృష్ణంరాజు గారికి ముగ్గురు కుమార్తెలు అనే విషయం మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago