Tag Archives: krishnam raju

Shayamala Devi: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ పెద్దమ్మ.. ఇందులో నిజమెంత?

Shayamala Devi: సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా ప్రభాస్ పెద్దమ్మ దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. తాజాగా కృష్ణం రాజు జయంతి సందర్భంగా మీడియాతో ముచ్చటించిన శ్యామలా దేవి తన భర్త గురించి, హీరో ప్రభాస్ గురించి తన ఫ్యామిలీ విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. అందులో భాగంగానే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

అదేమిటంటే శ్యామల దేవి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా మారింది. అయితే శ్యామలా దేవి భర్త దివంగత నటుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు రాజకీయాల్లో రాణించిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ తో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. పాలిటిక్స్‌లో ఆయన అనేక ఆటుపోట్లను చూశారు. నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రధానమంత్రి వాజపేయి మంత్రి వర్గంలో చోటు కూడా సంపాదించారు. బీజేపీలో చాలా కాలం కొనసాగారు కృష్ణంరాజు.

మధ్యలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళినా అక్కడ ఎక్కువకాలం ఉండలేకపోయారు. మళ్లీ బీజేపీ బాట పట్టారు. ఇక కృష్ణం రాజు మరణించిన ఇంత కాలానికి ఇప్పుడు ఆయన సతీమణి శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. నిన్నటి వరకు ఈ విషయంపై శ్యామలా దేవి స్పందించలేదు. తాజాగా కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌ నిర్వహణను స్వయంగా చూసుకున్నారు శ్యామలా దేవి. అంతే కాకుండా చాలా కాలంగా వినిపిస్తున్న తన రాజకీయరంగ ప్రవేశంపై కూడా మాట్లాడారు.

కృష్ణంరాజు మార్గంలోనే నడుస్తాను..

కృష్ణంరాజు మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. పేదలకు విద్య, వైద్యం అందేలా చూడాలని కృష్ణంరాజు ఎంతగానో తపనపడేవారని, అందుకే ఆయన జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి తన ఆలోచన అంతా నిరుపేదలకు వైద్యం అందించడంపైనే ఉందని చెబుతూ జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తానని ఆమె వివరించారు. ఈ రకంగా ఆమె రాజకీయ ప్రవేశం వార్తలను కొట్టిపారేయలేదు. రాజకీయాల్లోకి వస్తారు కాబట్టే.. తరువాత విషయం ప్రకటిస్తాను అన్నట్టు హింట్ ఇచ్చారు. ఇక శ్యామలా దేవి వైసీపీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆ పార్టీలోకి వెళ్ళడం దాదాపు ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు లాంచనంగా వైసీపీలోకి వెళ్లడమే మిగిలినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Krishnam Raju: అన్నం కోసం ఎనిమిది కిలోమీటర్లు నడిచిన కృష్ణంరాజు… అందుకే అందరి కడుపు నింపుతున్నారా?

Krishnam Raju:టాలీవుడ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు గారు గత నెల 11వ తేదీ అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం మనకు తెలిసిందే.

కృష్ణంరాజు రాజుల కుటుంబంలో జన్మించిన వ్యక్తి కావడంతో ఈయన ఇంటికి వెళితే వారికి అతిథ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదని మనకు తెలిసిందే.అదేవిధంగా ఈయన సినిమా షూటింగ్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఎన్నో రకాల భోజనాలను తెప్పించి కడుపునిండా వారికి ఆహారం పెడతారు.ఇక ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ కూడా అతిథి మర్యాదలకు ఏమాత్రం తీసిపోరు.అయితే కృష్ణంరాజు ఇలా అందరికీ అన్నం పెట్టడం వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది.

కృష్ణం రాజుగారు తన కెరియర్ ప్రారంభించిన మొదట్లో ఈయన జర్నలిస్టుగా పనిచేసేవారు.ఇలా జర్నలిస్టుగా పనిచేసినటువంటి ఈయన సినిమాలపై మక్కువతో సినిమా అవకాశాల కోసం ఆఫీసులో చుట్టూ తిరిగే వారట.అయితే ఈయన దగ్గర చాలీచాలని డబ్బులు ఉండడంతో కొన్నిసార్లు ఒక పూట మాత్రమే తిని మరికొన్నిసార్లు ఒక పూట పస్తులు ఉండేవారు.అయితే ఈయన రాజుల కుటుంబానికి చెందినప్పటికీ ఇంట్లో వారు సినిమాలలోకి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో ఈయన ఇంట్లో వారిని డబ్బులు అడిగే వారు కాదట.

Krishnam Raju: ఆకలి విలువ తెలిసిన వ్యక్తి కృష్ణంరాజు…

ఈ విధంగా ఒకసారి ఉదయం భోజనం చేసిన తర్వాత బాగా ఆకలి వేసింది అయితే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంటి కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్నేహితుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి తనని అప్పుగా డబ్బును అడిగారట.అయితే కృష్ణంరాజు గారి మొహమాటన్ని గుర్తించిన తన స్నేహితుడు ఆయనకు కడుపునిండా అన్నం పెట్టి మరి డబ్బులు ఇచ్చి పంపించారు అప్పటినుంచి కృష్ణంరాజు గారు ఎవరు వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టడమే కాకుండా సినిమా లొకేషన్ కి వెళ్ళిన అక్కడ కూడా అందరికీ భోజనాలు పంపించేవారని, ఆ ఆకలి విలువ తెలిసిన వ్యక్తి కనుక అందరి కడుపు నింపుతున్నారని తెలుస్తోంది.

Krishnam Raju: కృష్ణంరాజు సంస్కరణ సభ కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Krishnam Raju:దివంగత నటుడు టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈనెల 11వ తేదీ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా కృష్ణంరాజు మరణం తర్వాత ఆయన సంస్కరణ సభను తన సొంత గ్రామమైన మొగల్తూరులో నిర్వహించారు. ఈ క్రమంలోనే సుమారు 12 సంవత్సరాల తర్వాత ప్రభాస్ మొగల్తూరులో అడుగుపెట్టడంతో పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడును చూడటం కోసం కృష్ణంరాజు అభిమానులు ప్రభాస్ అభిమానులు భారీగా తరలి వచ్చారు.

ఇక తన పెదనాన్న సంస్కరణ సభ కోసం తరలివచ్చిన అభిమానులకు ప్రభాస్ కడుపునిండా భోజనం పెట్టి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వివిధ రకాల భోజనాలను తయారు చేయించి అభిమానులకు కడుపునిండా భోజనం పెట్టి పంపించారు. అయితే ఈ సంస్కరణ సభ కోసం ప్రభాస్ సుమారు 6 నుంచి ఏడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.సంస్కరణ సభ కోసం వచ్చిన అభిమానులకు టన్నులకొద్దీ ఆహార పదార్థాలను తయారు చేయించారు.

ఈ క్రమంలోనే ఈ ఆహార పదార్థాలకు సంబంధించిన మెనూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణంరాజు సంస్కరణ సభ కోసం ప్రభాస్ ఏకంగా 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 4 టన్నుల సందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు.. ఇవి కాక మరో 22 రకాల నాన్ వెజ్ తయారు చేయించినట్లు తెలుస్తోంది.

Krishnam Raju: కోట్లు ఖర్చుపెట్టిన ప్రభాస్…

ఇలా సంస్కరణ సభ కోసం వచ్చిన అభిమానులకు ఇన్ని రకాల ఆహార పదార్థాలను తయారు చేయించడంతో మరోసారి వీరి అతిథి మర్యాదలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిపోయింది. ఇంత బాధలో ఉన్నప్పటికీ అభిమానుల ఆకలి గురించి ఆలోచించిన ఏకైక హీరో ప్రభాస్ అని చెప్పాలి. అయితే కృష్ణంరాజు కార్యక్రమాలు అన్నింటిని పూర్తి చేసుకున్న తర్వాత ప్రభాస్ అభిమానుల ముందుకు వచ్చి అభిమానులతో ముచ్చటించి మరి కాసేపట్లో భోజనాలు తయారవుతాయి ప్రతి ఒక్కరు తప్పకుండా భోంచేసి వెళ్లాలని అభిమానులకు సూచించారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Krishnam Raju: కోనసీమలో రెబల్ స్టార్ మైనపు విగ్రహం.. వైరల్ అవుతున్న కృష్ణం రాజు మైనపు విగ్రహ ఫోటోలు!

Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. కృష్ణంరాజు మరణించడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కృష్ణంరాజు గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.ఇక ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి కృష్ణంరాజుకి ముగ్గురు కుమార్తెలు కావడంతో ఈయన వారసుడిగా ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇలా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఎన్నో సలహాలు సూచనలు చేస్తూ ఆయన ఎదుగుదలకు కృషి చేశారు.ఈ విధంగా ప్రభాస్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా ఎదగడం చూసిన కృష్ణంరాజు ఎంతో సంబరపడ్డారు. అయితే నేడు ప్రభాస్ పెదనాన్న చనిపోవడంతో అన్ని తానై దగ్గరుండి ఆయన కార్యక్రమాలను చూసుకుంటున్నారు.ఇకపోతే కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ఈ క్రమంలోనే ఆయన సమారాధన కార్యక్రమాల కోసం కృష్ణంరాజు కుటుంబ సభ్యులు మొత్తం రెండు రోజులపాటు మొగల్తూరులో ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణంరాజు పై ఉన్న అభిమానంతో కోనసీమ జిల్లా ప్రజలు ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొత్తపేటలోని ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ని సంప్రదించి కృష్ణంరాజు మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. అయితే శిల్పి రాజ్ కుమార్ కేవలం నాలుగు రోజులలోనే ఈయన మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Krishnam Raju:కృష్ణం రాజు గారి పై అభిమానంతో…

ఇలా కృష్ణంరాజు గారిపై ఉన్న అభిమానంతో కోనసీమ జిల్లా ప్రజలు ఆయన విగ్రహాన్ని తయారుచేసి ఆయన దశదిన కార్యక్రమానికి ఈ విగ్రహాన్ని అందజేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయంపై శిల్పి రాజ్ కుమార్ మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా కృష్ణంరాజు గారికి అభిమానిని అయితే ఆయన మరణం తనని ఎంతగానో బాధించిందని ఈయన వెల్లడించారు. ఇకపోతే ప్రస్తుతం కృష్ణంరాజు గారికి సంబంధించిన ఈ మైనపు విగ్రహ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Krishnam Raju: కృష్ణంరాజు అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో చేయడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?

Krishnam Raju: సినీ నటుడు రాజకీయ నాయకుడు మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణించడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సినీ తారలు మొత్తం తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇకపోతే సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలను మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో నిర్వహించారు.

ముందుగా కృష్ణంరాజు గారి అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఈయన అంత్యక్రియలు మాత్రం కనకమామిడి ఫామ్ హౌస్ లో అధికారక లాంచనాలతో నిర్వహించారు. అయితే ఇలా అంత్యక్రియలను ఫామ్ హౌస్ లో నిర్వహించడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది.కృష్ణంరాజు ఎంతో ఇష్టపడి ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని త్వరలోనే ఇక్కడ తన అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకొని ఇక్కడే నివాసం ఉండాలని భావించినట్లు తెలుస్తోంది.

ఇలా ఈయన బ్రతుకున్న సమయంలో తాను మరణిస్తే అదే ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు చేయాలని తన ఇంటిని చూసుకుంటూ అక్కడే ఉంటానంటూ పలుసార్లు వెల్లడించారట.ఇలా బ్రతికున్న సమయంలో తన అంత్యక్రియలు అక్కడే చేయాలని తన పెదనాన్న కోరడంతో ప్రభాస్ చివరి క్షణంలో తన అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ నిర్వహించారు.

Krishnam Raju: కృష్ణంరాజు కోరిక మేరకే అంత్యక్రియలు..

ఇలా కృష్ణంరాజు కోరిక ప్రకారమే ఆయన అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో నిర్వహించారు ప్రభాస్ చేతుల మీదుగా కాకుండా తన సోదరుడు ప్రబోద్ చేతులమీదుగా కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. కృష్ణంరాజు గారికి కుమారులు లేకపోవడంతో తన సోదరుడు కుమారుడైన ప్రబోద్ చేతులమీదుగా జరిగాయి. కృష్ణంరాజు గారికి ముగ్గురు కుమార్తెలు అనే విషయం మనకు తెలిసిందే.

Krishnam Raju: ఆ విషయంలో నేను ఎప్పటికీ రిచ్ స్వయంగా ఒప్పుకున్న కృష్ణంరాజు.. వైరల్ అవుతున్న కామెంట్స్!

Krishnam Raju: టాలీవుడ్ రెబల్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈయన గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో మృతి చెందారు.

ఇలా కృష్ణంరాజు మరణించారన్న వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో పలువురు సినీ ప్రముఖులు తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆయనకు నివాళులు అర్పించారు.ఇకపోతే గతంలో కృష్ణంరాజు పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే కృష్ణంరాజు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ ఒక విషయంలో తాను ఎప్పటికీ రిచ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజు ఎంతో సంపన్నుల కుటుంబంలో జన్మించారు. అయితే తాను ఆస్తులు విషయంలో రిచ్ కాదని మనసు విషయంలో చాలా రిచ్ అంటూ గతంలో కృష్ణంరాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాను సినిమాలలో సంపాదించినది మొత్తం దాచి పెట్టకుండా ఎక్కువ భాగం ఖర్చులు చేసే వాణ్ణి అంటూ ఈయన తెలిపారు.

Krishnam Raju: సంపాదనలో ఎక్కువ భాగం ఖర్చుపెట్టేవాడిని…

తాను ఇంటి నుంచి స్టూడియోకు వెళ్లే వరకు మాత్రమే కృష్ణంరాజు ఒకసారి మేకప్ వేసుకున్నాను అంటే ఈ ప్రపంచంతో తనకు పని ఉండదని ఈయన తెలిపారు. ఇక తనకు పేకాట ఆడడం, మందు కొట్టడం కూడా అలవాటుగానే ఉన్నాయని అయితే ఎప్పుడూ కూడా లిమిట్ దాటదు అంటూ ఈయన వెల్లడించారు.ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారాలలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని అయితే లాభనష్టాలు గురించి ఆలోచించుకోకుండా వ్యాపారాలు చేస్తూ ఉండేవాడిని అంటూ గతంలో కృష్ణంరాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Krishnam Raju: కృష్ణంరాజు మృతదేహం వద్ద అల్లు అర్జున్ వింత ప్రవర్తన… ఏకిపారేస్తున్న నెటిజన్స్…?

Krishnam Raju: అలనాటి ప్రముఖ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో ఎంతోమంది సినీ ప్రముఖులు కృష్ణంరాజు పార్తివదేహాన్ని దర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి వంటి ప్రముఖులు కృష్ణంరాజుకు నివాళులు అర్పించారు. మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా కృష్ణంరాజు పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కృష్ణంరాజు ఇంటికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించాడు ఆ తర్వాత ప్రభాస్ తో కొంత సమయం చర్చించాడు.అయితే ఇక్కడే అల్లు ప్రవర్తన అందరికీ వింతగా అనిపించింది. కృష్ణంరాజు మృతి పట్ల అందరూ సంతాపం తెలియజేస్తూ బాధలో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆయన మృతదేహం వద్ద నవ్వుతూ కనిపించాడు. అంతే కాకుండా ప్రభాస్ తో మాట్లాడే సమయంలో కూడా అల్లు అర్జున్ మొహంలో నవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో నెటిజన్స్ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు.

కృష్ణంరాజు మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోవడంతో అందరూ దుఃఖంలో మునిగి ఉన్నారు. అల్లు అర్జున్ మాత్రం ఆయన పార్థివ దేహం వద్ద ఇలా నవ్వుతూ కనిపించడంతో నెటిజన్స్ అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు. పరిశ్రమకు చెందిన వ్యక్తిగా కృష్ణంరాజు లాంటి ఒక ఇండస్ట్రీ పెద్దను కోల్పోయాం అన్న బాధతో ఉండాల్సింది పోయి ఇలా నవ్వటం ఏంటి అని ఏకీపారేస్తున్నారు.

Krishnam Raju: అల్లు అర్జున్ పై మండిపడుతున్న యాంటీ ఫ్యాన్స్..

అల్లు అర్జున్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోని వెనకేసుకు వస్తూ అల్లు అర్జున్ మొహంలో నవ్వు లేదని అతని మొహం విషాదంలో ఉందని తమ అభిమానం నటుడికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం ఇదే అదునుగా భావించి తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Krishnam Raju: ప్రభాస్ సోదరుడి ప్రబోద్ చేతుల మీదుగా కృష్ణంరాజు అంత్యక్రియలు!

Krishnam Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో 180 కి పైగా సినిమాలలో నటించి రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా రక్త సరఫరా సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. అయితే శనివారం నాడు కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి ఆయన ఊపిరితిత్తుల పనితీరు మందగించింది.

ఏఐజి హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి డాక్టర్లు అతనిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆదివారం తెల్లవారుజామున 3.30 నిమిషాల ప్రాంతంలో గుండెపోటుతో ఆయన తుది విశ్వాస విడిచాడు. కృష్ణంరాజు మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణంరాజు సినీ నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు ఎన్నో సేవలు అందించాడు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించాడు.

ఇలా మంచి మనసున్న వ్యక్తిగా మంచి పేరు పొందిన కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు పార్థివ దేహాన్ని దర్శించి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కృష్ణమరాజు అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Krishnam Raju: కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహించిన ప్రమోద్..

పండితుల సూచన మేరకు అంత్యక్రియలను కొంత సమయం వాయిదా వేసి ఒంటిగంట తర్వాత ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే కృష్ణంరాజు అంత్యక్రియలు మాత్రం ప్రభాస్ సోదరుడు ప్రబోద్ చేతుల మీదుగా జరగనున్నట్లు సమాచారం. అయితే కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైనటువంటి మెయినా బాద్ ఫామ్ హౌస్ లో నిర్వహించాలని భావించారట. తమ అభిమాన నటుడు చివరి చూపు కోసం ఎంతోమంది అభిమానులు తరలి వచ్చారు. ప్రభుత్వ అధికారిక లాంచనాలతో ఈయన అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.

Krishnam Raju: పెదనాన్న ఆఖరి కోరిక నెరవేర్చలేకపోయిన ప్రభాస్.. కృష్ణంరాజు ఆఖరి కోరిక ఏమిటో తెలుసా..?

Krishnam Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో 183 పైగా సినిమాలలో నటించి రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సహనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో సినిమాలలో నటించిన కృష్ణంరాజు ఇటీవల మృతి చెందారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.

కృష్ణంరాజు మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభాస్ ఎంతగానో అభిమానించే తన పెదనాన్న ఇలా మృత్యువాత పడటంతో శోకంలో మునిగిపోయాడు. అయితే ప్రస్తుతం కృష్ణంరాజు చివరి కోరిక గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి చూడటమే కృష్ణంరాజు ఆఖరి కోరిక అని కొందరు అంటుంటే … ప్రభాస్ పిల్లలతో కలిసి నటించాలన్నది కృష్ణంరాజు ఆఖరి కోరిక అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కృష్ణంరాజు తన ఆఖరి కోరిక గురించి కృష్ణంరాజు వెల్లడించారని తెలుస్తోంది. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగినప్పటికీ.. తన పెదనాన్న ఆఖరి కోరిక మాత్రం తీర్చలేకపోయాడు.

Krishnam Raju: అధికారక లాంచనాలతో అంత్యక్రియలు

ఇదిలా ఉండగా సోమవారం రోజు మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నారు. హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా రాణించిన కృష్ణంరాజు మంచితనానికి మారుపేరుగా నిలిచాడు. అయితే కృష్ణంరాజు గారు ఇలా అకాల మరణం చెందడంతో పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కృష్ణంరాజు మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Krishnam Raju First Wife: కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి ఎలా చనిపోయారో తెలుసా?

Krishnam Raju First Wife: టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు అనారోగ్య సమస్య కారణంగా నేడు ఆసుపత్రిలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈయన మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించనున్నారు. ఇప్పటికే హాస్పిటల్ నుంచి కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కృష్ణంరాజు గారిని హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించే చికిత్స చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో నేడు తెల్లవారుజామున ఈయన తుది శ్వాస విడిచారు.ఇలా కృష్ణం రాజుగారు చనిపోయారని విషయం తెలియడంతో ఇండస్ట్రీలోని ఎంతో మంది సెలబ్రిటీలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన 1940 జనవరి 20 వ తేదీ మొగల్తూరులో జన్మించారు. ఈయన విద్యభ్యాసం మొత్తం నరసాపురంలోనే జరిగింది. ఇక ఈయన మొదటి వివాహాన్ని సీతాదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఇలా తన భార్యతో వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి కృష్ణంరాజుకు కారు ప్రమాదంలో తన భార్య సీతాదేవి మరణించడం తనని శోకసంద్రంలోకి నెట్టివేసింది.

Krishnam Raju First Wife: కారు ప్రమాదంలో మరణించిన భార్య…

ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట పట్ల ఆ దైవం కూడా కుళ్ళుకుందేమో ఇలా కారు ప్రమాదంలో సీతాదేవిని తీసుకెళ్లిపోయారు. మీరు ప్రేమకు గుర్తుగా ఒక అమ్మాయి కూడా ఉన్నారు. ఇకపోతే సీతాదేవి మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈయన కుటుంబ సభ్యుల బలవంతంతో 1996లో శ్యామల దేవిని వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ముగ్గురు కుమార్తెలు.ఇక ఈయనకు వారసులు లేకపోవడంతో తన సోదరుడు కుమారుడు ప్రభాస్ ను తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్థాయి హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.