Movie News

Shayamala Devi: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ పెద్దమ్మ.. ఇందులో నిజమెంత?

Shayamala Devi: సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా ప్రభాస్ పెద్దమ్మ దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. తాజాగా కృష్ణం రాజు జయంతి సందర్భంగా మీడియాతో ముచ్చటించిన శ్యామలా దేవి తన భర్త గురించి, హీరో ప్రభాస్ గురించి తన ఫ్యామిలీ విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. అందులో భాగంగానే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

అదేమిటంటే శ్యామల దేవి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా మారింది. అయితే శ్యామలా దేవి భర్త దివంగత నటుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు రాజకీయాల్లో రాణించిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ తో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. పాలిటిక్స్‌లో ఆయన అనేక ఆటుపోట్లను చూశారు. నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రధానమంత్రి వాజపేయి మంత్రి వర్గంలో చోటు కూడా సంపాదించారు. బీజేపీలో చాలా కాలం కొనసాగారు కృష్ణంరాజు.

మధ్యలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళినా అక్కడ ఎక్కువకాలం ఉండలేకపోయారు. మళ్లీ బీజేపీ బాట పట్టారు. ఇక కృష్ణం రాజు మరణించిన ఇంత కాలానికి ఇప్పుడు ఆయన సతీమణి శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. నిన్నటి వరకు ఈ విషయంపై శ్యామలా దేవి స్పందించలేదు. తాజాగా కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌ నిర్వహణను స్వయంగా చూసుకున్నారు శ్యామలా దేవి. అంతే కాకుండా చాలా కాలంగా వినిపిస్తున్న తన రాజకీయరంగ ప్రవేశంపై కూడా మాట్లాడారు.

కృష్ణంరాజు మార్గంలోనే నడుస్తాను..

కృష్ణంరాజు మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. పేదలకు విద్య, వైద్యం అందేలా చూడాలని కృష్ణంరాజు ఎంతగానో తపనపడేవారని, అందుకే ఆయన జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి తన ఆలోచన అంతా నిరుపేదలకు వైద్యం అందించడంపైనే ఉందని చెబుతూ జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తానని ఆమె వివరించారు. ఈ రకంగా ఆమె రాజకీయ ప్రవేశం వార్తలను కొట్టిపారేయలేదు. రాజకీయాల్లోకి వస్తారు కాబట్టే.. తరువాత విషయం ప్రకటిస్తాను అన్నట్టు హింట్ ఇచ్చారు. ఇక శ్యామలా దేవి వైసీపీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆ పార్టీలోకి వెళ్ళడం దాదాపు ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు లాంచనంగా వైసీపీలోకి వెళ్లడమే మిగిలినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago