Meena: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె రెండు తరాల ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీనా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాకుండా దృశ్యం వంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రులను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే అప్పట్లో మీనా రజినీకాంత్,చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అంతేకాకుండా అప్పట్లోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.
ఆమె కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించింది. కెరిర్ మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. మరోవైపు తమిళంలో ఒక రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్‌లో ఈమెకు బోల్డ్ రోల్స్, గ్లామర్ సీన్స్ గురించి ప్రశ్నలు ఎదురవగా.. పలు ఆసక్తికర విషయాల్ని మీనా బయటపెట్టింది. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. నేను నార్మల్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో నా చుట్టూ ఉన్నవాళ్లు గ్లామర్ రోల్స్ ఎందుకు ప్రయత్నించకూడదా అని అడిగారు.
వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలనిపించింది..
మరీ ముఖ్యంగా బోల్డ్ సీన్స్, స్విమ్ సూట్ వేసుకునే పాత్రలు చేయాలని కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ ప్రభుదేవా నాకు సలహా ఇచ్చారు. అయితే కొన్నాళ్లకు అలాంటి ఛాన్స్ వచ్చింది. ప్రభుదేవాతో చేసిన సినిమాలో ఒక సీన్‌లో భాగంగా స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్నాను. కాకపోతే సిగ్గుతో మేకప్ రూమ్ నుంచి బయటకు రాలేకపోయాను. ఇక స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్న తర్వాత అసలు ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడతానో అని తెగ భయపడి పోయాను. ఏదేమైనా బోల్డ్ పాత్రల్లో నటించడం నిజంగా చాలా కష్టమైన పని. ఇంకా చెప్పాలంటే బోల్డ్ సీన్స్ చేసే హీరోయిన్ల పాదాలకు దండం పెట్టాలని అప్పుడే అనిపించింది అని తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది మీనా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…