Prabhas – Ntr: తాజాగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ సమయం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక నిన్నటి రోజున అయోధ్య ప్రాంగణమంతా కూడా రామనామ స్మరణలతో మారుమోగిపోయింది. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి కొలువుదీరిన తరువాత రామమందిరంతో పాటు సరయూ నదీతీరం దీపోత్సవ్ కార్యక్రమంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది.
రామనామం మారుమోగింది. గర్భగుడిలో కొలువుతీరిన బాలరాముడిని చూసి భక్తులు పులకరించిపోతున్నారు. ఇక నిన్న జరిగిన బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ కూడా హాజరైన విషయం తెలిసిందే. వీరితోపాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు కూడా ఆహ్వానం అందింది. కానీ ఈ ఇద్దరు హీరోలు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
అయోధ్యకు రాకపోవడం కారణం అదే..
అయితే ఇద్దరు హీరోలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి గల కారణం షూటింగ్స్ తో బిజీగా ఉండటమే అని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమాషూటింగ్ లో ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు హాజరుకాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా హీరో ప్రభాస్ అయోధ్యలోని రామ మందిరానికి దాదాపుగా 50 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…