Categories: FeaturedMovie News

Krishnam Raju: అన్నం కోసం ఎనిమిది కిలోమీటర్లు నడిచిన కృష్ణంరాజు… అందుకే అందరి కడుపు నింపుతున్నారా?

Krishnam Raju:టాలీవుడ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు గారు గత నెల 11వ తేదీ అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం మనకు తెలిసిందే.

కృష్ణంరాజు రాజుల కుటుంబంలో జన్మించిన వ్యక్తి కావడంతో ఈయన ఇంటికి వెళితే వారికి అతిథ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదని మనకు తెలిసిందే.అదేవిధంగా ఈయన సినిమా షూటింగ్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఎన్నో రకాల భోజనాలను తెప్పించి కడుపునిండా వారికి ఆహారం పెడతారు.ఇక ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ కూడా అతిథి మర్యాదలకు ఏమాత్రం తీసిపోరు.అయితే కృష్ణంరాజు ఇలా అందరికీ అన్నం పెట్టడం వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది.

కృష్ణం రాజుగారు తన కెరియర్ ప్రారంభించిన మొదట్లో ఈయన జర్నలిస్టుగా పనిచేసేవారు.ఇలా జర్నలిస్టుగా పనిచేసినటువంటి ఈయన సినిమాలపై మక్కువతో సినిమా అవకాశాల కోసం ఆఫీసులో చుట్టూ తిరిగే వారట.అయితే ఈయన దగ్గర చాలీచాలని డబ్బులు ఉండడంతో కొన్నిసార్లు ఒక పూట మాత్రమే తిని మరికొన్నిసార్లు ఒక పూట పస్తులు ఉండేవారు.అయితే ఈయన రాజుల కుటుంబానికి చెందినప్పటికీ ఇంట్లో వారు సినిమాలలోకి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో ఈయన ఇంట్లో వారిని డబ్బులు అడిగే వారు కాదట.

Krishnam Raju: ఆకలి విలువ తెలిసిన వ్యక్తి కృష్ణంరాజు…

ఈ విధంగా ఒకసారి ఉదయం భోజనం చేసిన తర్వాత బాగా ఆకలి వేసింది అయితే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంటి కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్నేహితుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి తనని అప్పుగా డబ్బును అడిగారట.అయితే కృష్ణంరాజు గారి మొహమాటన్ని గుర్తించిన తన స్నేహితుడు ఆయనకు కడుపునిండా అన్నం పెట్టి మరి డబ్బులు ఇచ్చి పంపించారు అప్పటినుంచి కృష్ణంరాజు గారు ఎవరు వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టడమే కాకుండా సినిమా లొకేషన్ కి వెళ్ళిన అక్కడ కూడా అందరికీ భోజనాలు పంపించేవారని, ఆ ఆకలి విలువ తెలిసిన వ్యక్తి కనుక అందరి కడుపు నింపుతున్నారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago