Poonam kaur: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి పూనమ్ కౌర్ చేసినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈమెకు వచ్చిన పాపులారిటీ మాత్రం మామూలుగా లేదు. అయితే ఈ పాపులారిటీ సినిమాల ద్వారా వచ్చింది కాదండోయ్…సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే వివాదాస్పదమైన ట్వీట్ ల ద్వారా ఈమె పెద్ద ఎత్తున గుర్తింపు సంపాదించుకున్నారు. అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్లు చేస్తుందనే విషయం కూడా తెలియకుండా పరోక్షంగా ట్వీట్లు చేస్తూ వివాదాలకు కారణమవుతుంటారు.
ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ వివాదాస్పద బ్యూటీ గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంది.ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు అయితే ఈ ఫోటో చూసినటువంటి అభిమానులు ఈమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇలా రహస్యంగా పెళ్లి చేసుకున్నారా లేకపోతే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అందుకే ఇలాంటి ఫోటోని షేర్ చేశారా అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇంతకీ ఈమె షేర్ చేసిన ఫోటోలో ఏముందనే విషయానికి వస్తే… ఉత్తర భారత దేశంలో పెళ్లయిన మహిళలు తమ భర్త క్షేమంగా ఉండాలని ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగలలో కర్వా చౌత్ పండుగ ఒకటి.
ఈ పండుగ రోజు జల్లెడలో దీపాల వెలుగులను చూస్తూ తన భర్త క్షేమంగా ఉండాలని మహిళలు కోరుకుంటారు.
ఈ క్రమంలోనే ఈ పండుగను పూనమ్ కవూర్ కూడా జరుపుకోవడంతో ఈమె ఎవరికీ తెలియకుండా పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుందేమో అందుకే తనకు కాబోయే భర్త క్షేమంగా ఉండాలని ఇలా పండుగ జరుపుకున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీపపు వెలుగులలో జల్లెడ పట్టుకొని ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…