Kollywood: సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ ఈ పదాలను తరచూ వింటూనే ఉంటాం. ఒక ఇండస్ట్రీ అని కాదు హాలీవుడ్ నుండి అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లోను క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఒక్క సినిమా రంగంలోనే ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనుకోవడం పొరపాటు. ఇది అన్ని రంగాల్లో కూడా ఉంది. అయితే సినిమా రంగంలో ఎక్కువగా బయటకు వినిపిస్తుంది. చాలా మంది నటిమణులు ఈ విషయాలను నోరు విప్పడం వల్ల ఎంతగా ఇది విస్తరించిందో అర్థం అవుతుంది. అయితే ఇపుడు ఈ క్యాస్టింగ్ కౌచ్ మరో వికృత రూపం దాల్చిన ఘటన కొలీవుడ్ లో జరిగింది.
ఆమె నెంబర్ ఇవ్వకపోతే నీ భార్యను రేప్ చేస్తా….
తమిళనాడు రామ పురంకు చెందిన ఏంఎస్ ప్రభు అనే వ్యక్తి దాదాపు 30 సంవత్సరాలుగా సినీమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఉన్నాడు. 2006లో ఏఎల్ సూర్య అనే దర్శకుడు పరిచయం అయి ఆ తరువాత నటి పద్మ ప్రియాకు సంబంధిచిన వీడియో వల్ల ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఇక ఆ తరువాత నుండి దర్శకుడు సూర్య పద్మా ప్రియను పరిచయం చేయమని ప్రభుని అడగడం మొదలు పెట్టాడు. దీనిపై ప్రభు స్పందించకపోవడంతో ఈసారి ఏకంగా పద్మప్రియ ఫోన్ నెంబర్ అడగడం మొదలు పెట్టాడు. రానురాను ఒత్తిడి ఎక్కువైంది.
అయిన ప్రభు స్పందించకపోవడంతో సూర్య తెగించి హీరోయిన్ పద్మ ప్రియ నెంబర్ ఇవ్వకపోతే నీ భార్యను రేప్ చేస్తా అంటూ బెదిరించాడు. దీంతో ప్రభు రామపురం పోలీసులను ఆశ్రయించాడు. భారతి వీధికి చెందిన ప్రభు రామ పురం పోలీసులకు ఏఎల్ సూర్య గురించి భార్యను రేప్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనం రేపుతున్న ఈ ఉదంతం గురించి పూర్తి వివరాలు బయటికి తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…