Tollywood Heroines: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ సినిమాలో నటిస్తే వెంటనే ఆ హీరోయిన్లకు వరుస సినిమా అవకాశాలు వస్తుంటాయి.అయితే కొందరు మాత్రం కొన్ని సినిమాలలో నటించి మంచి హిట్ అందుకున్నప్పటికీ ఆ హీరోయిన్లకు ఎలాంటి సినిమా అవకాశాలు రాకపోవడమే కాకుండా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించి హిట్ అందుకున్న కొంతమంది సినీ తారల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పాలి. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమా ద్వారా హిట్ అందుకున్నటువంటి సంయుక్త మీనన్, కేథరిన్ వంటి హీరోయిన్లు ఇప్పటివరకు ఎలాంటి కొత్త సినిమాలను ప్రకటించలేదు.
అదేవిధంగా కార్తికేయ 2 సినిమా ద్వారా హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ కేవలం సౌత్ లో కాకుండా నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినప్పటికీ ఈమె మాత్రం కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇక ఈ సినిమాలో అనుపమ కాకుండా మరెవరు నటించిన సినిమా రిజల్ట్ అలాగే ఉండేదని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా విజయం అందుకున్న అనంతరం చాలామంది హీరో నిఖిల్ నటనపై ప్రశంసలు కురిపించారు కానీ అనుపమ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు.
ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ కొట్టిన రీతు వర్మ కూడా తన తదుపరి ప్రాజెక్టు గురించి తెలియజేయలేదు. ఇక రీతు వర్మ ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఎక్కడ గ్లామర్ షో కి తావు లేకుండా నటిస్తూ ఉంటారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచినటువంటి సినిమాలలో నటించిన ఈ హీరోయిన్లకు ఇప్పటివరకు అవకాశాలు రాలేదు. మరి కొత్త సినిమాలలో అవకాశాలు వస్తాయా లేదా అనే విషయం పై కూడా స్పష్టత లేదని చెప్పాలి.అయితే భవిష్యత్తులో వీరికి ఎలాంటి అవకాశాలు వస్తాయి ఎవరి కెరియర్ ఎటు ప్రయాణం చేస్తుందో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…