Kangana Ranaut: ప్రతి ఏడాది చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తూ వివిధ భాషల నుంచి కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసి సైమా అవార్డులను ప్రధానం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 2021 సంవత్సరానికి గాను సైమా అవార్డు వేడుకలను బెంగళూరులో ఎంతో ఘనంగా నిర్వహించారు. వివిధ భాషల నుంచి బెస్ట్ సినిమాలను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రధానం చేశారు.
ఇకపోతే తమిళంలో తెరకెక్కిన తలైవి సినిమాలో నటించినందుకుగాను ఉత్తమ నటిగా కంగనా రనౌత్ సైమా అవార్డు అందుకున్నారు.అయితే ఈమెకు సాయి
సైమా అవార్డు ఇవ్వడంతో సైమా నిర్వాహకులు పెద్ద ఎత్తున నవ్వుల పాలయ్యారు. ముఖ్యంగా తలైవి సినిమాలో జయలలిత పాత్రకు కంగనా ఏమాత్రం సరిపోలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అదేవిధంగా ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.
ఇలా మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమాలో నటించిన కంగనాకు సైమా అవార్డు ఇవ్వడం ఏంటి అని అందరూ నవ్వుకున్నారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే తలైవి సినిమాను నిర్మించినది మరెవరో కాదు సైమా వేడుకలను నిర్వహించే వాళ్లే నిర్మాతలుగా వ్యవహరించారు. ఇలా డబ్బు పెట్టిన వాళ్ళే తిరిగి ఆ సినిమాకి అవార్డు ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడమే కాకుండా నవ్వుల పాలయ్యారు.
అయితే తమిళంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు సైమా నామినేషన్ లో ఉన్నప్పటికీ కంగనాకు ఈ అవార్డు రావడం పట్ల నిజంగానే ఆడియన్స్ పోల్ ద్వారానే ఈ అవార్డులు ఇస్తున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సైమ నామినేషన్ లో భాగంగా తమిళంలో నిలిచినటువంటి సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..నెట్రికన్’ నుండి నయనతార, ‘జై భీమ్’ నుండి లియోమోల్ జోజ్, ‘అన్‌బిర్‌కినియాల్’ నుండి కీర్తి పాండియన్, ‘తిట్టమ్ ఇరండు’ నుండి ఐశ్వర్య రాజేష్ పోటీలో ఉన్నప్పటికీ కంగనాకు అవార్డు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…