Actor Rana: ఇండస్ట్రీలో దగ్గుబాటి వారసుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రానా గురించి అందరికీ సుపరిచితమే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్న రానా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు.
ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇకపోతే గత కొద్ది రోజులుగా రానా ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రానా అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు.
గతంలో ఒకసారి తనకు కంటి సమస్య ఉందని చెప్పిన రానా తాజాగా మరోసారి తన సమస్య గురించి ఓపెన్ అయ్యారు. తనకు చిన్నప్పటి నుంచి కుడి కన్ను అసలు కనిపించదని రానా ఈ సందర్భంగా మరోసారి వెల్లడించారు. తనకు చిన్నప్పుడే ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి సర్జరీ జరిగిందని రానా తెలిపారు. అదేవిధంగా కిడ్నీ మార్పిడి కూడా జరిగింది అంటూ రానా ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ విధంగా కన్ను, కిడ్నీ రెండింటికీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ విషయంలో నేను టెర్నినేటర్ని అనుకుంటున్నాను. చాలా మంది శారీరక సమస్యలు వస్తే బాధపడుతుంటారు. ఆ సమస్యలు నయమైన బాధపడుతూ ఉంటారు.అయితే అలా ఎప్పుడూ ఉండకూడదని ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి ముందుకెళ్లాలంటూ ఈ సందర్భంగా రానా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ధైర్యం చెప్పారు. మొత్తానికి ఈయన ఆరోగ్య సమస్యలను గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…