Hero Venu Thottempudi : ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన వేణు తొట్టెంపూడి ఆ తరువాత చిరునవ్వుతో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చిరునవ్వుతో సినిమాలో నటనకు వేణు కి అలాగే డైలాగులకు త్రివిక్రమ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత ఇతర హీరోలతో కలిసి మల్టీ స్టారర్ చేసిన వేణు కెరీర్ లో హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరేళితే, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. తోమిదేళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వైపు చూసిన వేణు రవితేజ తో కలిసి రామ రావు ఆన్ డ్యూటీ సినిమాను చేసారు. తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న వేణు తన కెరీర్ లో చేసిన తప్పులను, అలాగే తన వ్యక్తిగత విషయాలను చెప్పారు.
త్రివిక్రమ్ ను సినిమా ఛాన్స్ అడిగినా…
చిరునవ్వు తో సినిమాతో రైటర్ గా త్రివిక్రమ్ కి హీరోగా వేణుకి మంచి బ్రేక్ వచ్చింది. అయితే ఆ సినిమా తరువాత త్రివిక్రమ్ స్టార్ రైటర్ అయిపోయాడు. ఆ తరువాత టాప్ హీరోలతో డైరెక్ట్ గా సినిమాలతో బిజీ అయ్యాడు. ఆ సమయంలోనే మహేష్ బాబుతో తీసిన ‘అతడు’ సినిమాలో సోనూ సూద్ పాత్రకు వేణుని చేయమని అడిగాడట త్రివిక్రమ్. అయితే విలన్ షేడ్ ఉన్న పాత్ర చేస్తే కెరీర్ లో ఇబందిపడాల్సి వస్తుందని సన్నిహితులు సలహా ఇవ్వడంతో ఆ సినిమా వదులుకున్నాడట వేణు. ఇక ఆ తరువాత త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు.
ఇక ఒకటి రెండు సార్లు తనకు సినిమా అవకాశం ఇవ్వమని వేణు త్రివిక్రమ్ ను అడిగినా ఆ కాంబినేషన్ కుదరలేదని చెప్పాడు వేణు. ఎంఏ ఇంగ్లీష్ చేసినోడిని వచ్చి ఒకటి రెండో తరగతి పిల్లాడికి ఇంగ్లీష్ పాఠాలు చెప్పమని అడిగితే ఇబ్బందిగా ఉంటుంది కదా అలానే ఈ విషయం అనిపించి ఉండవచ్చు అంటూ వేణు అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…