Ram Gopal Varma : సినిమా ఇండస్ట్రీలో అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. సినిమా హిస్టరీ తీస్తే వర్మ సినిమాలకు సెపరేట్ పేజీ ఉండాల్సిందే. ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసిన అద్భుత టెక్నిషియన్ వర్మ. శివ, రంగీలా, గాయం, గోవిందా గోవిందా, సత్య ఇలా దేనికవి భిన్నంగా చిత్రాలను తీసి అన్నింటా తన మార్క్ ఆలోచనలను జనం ముందు ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నాడు. తాను డైరెక్ట్ చేసిన సినిమా విశేషాలను అందిస్తూ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇటీవల రంగీలా సినిమా విశేషాలను పంచుకున్నారు వర్మ.
రెహమాన్ సమాధానంకి నీయమ్మ అని ఇరగగొట్టాలని అనిపించింది…
రంగీలా చిత్రానికి మెయిన్ హైలైట్ పాటలే. సంగీతం విషయంలో పెద్దగా కాన్సంట్రేట్ చేయని వర్మ ఆ సినిమాలో మాత్రం మ్యూజిక్ మీద ఇంట్రస్ట్ పెట్టాడట. ఆ సినిమా చేయాలనుకుంటున్న సమయంలో మణిరత్నం ఏఆర్ రెహమాన్ చేసిన రోజా సినిమా మ్యూజిక్ ను వర్మకి వినిపించడంతో మ్యూజిక్ అంటే ఇలా ఉంటుందా పాటలు ఇలా కంపోజ్ చేయొచ్చా అని వెంటనే రంగీలా సినిమాకు తననే పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఇక సాంగ్ కంపోజ్ చేయడానికి గోవా తీసుకెళ్లాడట వర్మ. ఐదు రోజులు సమయం ఇచ్చి కంపోజ్ చేయమని సిట్యుయేషన్ చెప్పగా నాలుగు రోజులు గడిచిన ఇంకా కంపోజ్ చేయకుండా చేస్తా చేస్తా అని రెహమాన్ చెప్పడంతో బాగా కోపం వచ్చి వర్మకు రెహ్మాన్ ను కొట్టాలనిపించిందట.
ఇక ఐదో రోజు ఇంకా పూర్తి కాలేదు చెన్నై కి వెళ్ళాక పంపిస్తా అని చెప్పి రెహ్మాన్ ఈసారి నాతో మ్యూజిక్ కంపోజ్ చేయించుకోవాలంటే టీవీ ఉన్న రూమ్ లో నన్ను వదలకు, నేను టీవీ చూస్తూ ఉండిపోయాను అంటూ చెప్పడంతో వర్మకు పట్టరాని కోపం వచ్చి నీయమ్మ అని లేచి కొట్టాలని అనిపించిదట. ఇక చెన్నై వెళ్లి రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసి సిడి పంపగా ఆ మ్యూజిక్ విని వెంటనే రెహమాన్ కి ఫోన్ చేసి ఏంటి ఈ మ్యూజిక్ ఎవరికో పంపాల్సింది నాకు పంపినట్లున్నావ్ అని అడిగాడట వర్మ. ఒకసారి హమ్ చెయ్ మ్యూజిక్ అనగానే వర్మ హమ్ చేయగా అది నీకనే పంపాను అని రెహమాన్ చెప్పాడట. ఇలాంటి సాంగ్ ఆ సిట్యుయేషన్ కి బాగోదు అని వర్మ అడుగగా ఆర్కెస్ట్రా తో చేసినపుడు చూడు ఈ సాంగ్ ఎలా వస్తుందో అని రెహమాన్ మాటిచ్చాడట. అలానే హై రామ సాంగ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో హరిహరన్, స్వర్ణలత వాయిస్ కి సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిందని వర్మ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…