Upasana: మెగా కోడలు ఉపాసన బిజినెస్ ఉమెన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఖరీదైన బంగ్లాను కొన్ని నెలలపాటు అద్దెకి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇలా రామ్ చరణ్ అమెరికాలో గత కొద్దిరోజులుగా పర్యటిస్తూ అక్కడే ఉన్న విషయం మనకు తెలిసిందే.
రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో నిలవడంతో రామ్ చరణ్ అక్కడే ఉంటూ పెద్ద ఎత్తున సినిమాని ప్రమోట్ చేస్తూ వచ్చారు. చివరికి అవార్డును కూడా అందుకున్నారు. ఇలా రామ్ చరణ్ అమెరికాలో ఉండడంతో ఉపాసన కూడా గత కొద్దిరోజులుగా అమెరికాలోనే ఉంటున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా అమెరికాలో ఉన్నటువంటి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో తన సౌకర్యానికి అనుగుణంగా లాస్ ఏంజెల్స్ లో ఒక ఖరీదైన ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు సమాచారం అలాగే ఆమె హెల్త్ చెకప్స్ కోసం అమెరికాకు వెళ్లాల్సి వస్తున్న నేపథ్యంలో ఈమె అక్కడే ఒక ఇంటిని కొన్ని నెలలపాటు రెంటుకు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇక అక్కడ తనకు తోడుగా ఉండడం కోసం ఇండియా నుంచి ముగ్గురు సిబ్బందిని కూడా ఉపాసన రాంచరణ్ తమ వెంట తీసుకెళ్లారని తెలుస్తోంది.ఇప్పటికే చిత్ర బృందం మొత్తం తిరిగి ఇండియాకు రాగా రామ్ చరణ్ ఉపాసన మాత్రం మరికొద్ది రోజులపాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇలా ఉపాసన ఖరీదైన ఇంటిని అద్దెకి తీసుకున్నారంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
సినిమాల్లో యాంగ్రీమ్యాన్‌గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజశేఖర్, నిజ జీవితంలో మాత్రం ఎంతో మానవతా భావంతో కూడిన వైద్యుడని…
ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు కష్టకాలంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న జట్టుకు, చెన్నై సూపర్…
బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా తన కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో…
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లో…
సినీ పరిశ్రమలో స్టార్ హీరోల గురించి వినిపించే కథల్లో కొన్ని నిజంగా హృదయాన్ని తాకుతాయి. అలాంటి సంఘటనలో ఒకటి తాజాగా…
బాలీవుడ్ సీనియర్ నటుడు అన్నూ కపూర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారి తీశాయి. ప్రముఖ నటి తమన్నా భాటియా…