Renu Desai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు.ఇండస్ట్రీలో హీరోయిన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రేణు దేశాయ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా ఈమె హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా దర్శకరాలిగా కూడా పేరుపొందారు.
ఇక పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తన పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తున్నారు. ఇలా తరచూ తన పిల్లలకు సంబంధించిన విషయాలతో పాటు హాలిడే వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటించే రేణు దేశాయ్ తాజాగా తాను ఓ వ్యాధితో బాధపడుతున్నానంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించారు.
ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా రేణు దేశాయ్ సైతం తాను కూడా ఓ వ్యాధితో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తన సమస్యను బయటపెట్టారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ స్పందిస్తూ శ్రేయోభిలాషులు మీకు ఓ విషయం చెప్పాలి. గత కొన్ని ఏళ్ల నుంచి తాను గుండె ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని ఈమె తెలియజేశారు.
ఇలాంటి సమస్యలతో బాధపడుతూ బలం తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టు అనిపించింది. నేను మాత్రమే కాదు నాలా బాధపడే వారందరూ కూడా బలంగా నిలబడాలని ఎవరు నిరుత్సాహంతో ఉండకుండా, పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండడం కోసమే ఈ పోస్ట్ చేస్తున్నాను.మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్న ధైర్యం కోల్పోకూడదు అంటూ ఈమె తన సమస్యను బయట పెట్టడమే కాకుండా ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…