Actor Sudhakar: సీనియర్ నటుడు సుధాకర్ ఆరోగ్యం గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఈయన ఆరోగ్యం ఏ మాత్రం బాగాలేదని ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అంటూ తరచూ నటుడు సుధాకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే ఈ వార్తలను నటుడు సుధాకర్ ఎన్నోసార్లు ఖండించిన ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.
సోషల్ మీడియా పుణ్యమా అని బ్రతికి ఉన్నటువంటి సెలబ్రిటీలను కూడా చంపేస్తున్నారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు బ్రతికుండగానే మరణించారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరికి ఈ వార్తల పై సెలబ్రిటీలు స్పందిస్తూ తాము బ్రతికే ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ క్రమంలోనే నటుడు సుధాకర్ ఆరోగ్యం గురించి కూడా ఎన్నో వార్తలు వచ్చాయి గతంలో కూడా ఈయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని మరణించారంటూ కూడా వార్తలు వచ్చాయి.అయితే ఇలా తన గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో రూమర్లు స్ప్రెడ్ అయినా సుధాకర్ స్పందిస్తూ ఆ వార్తలను ఖండిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా సుధాకర్ అనారోగ్యం క్షీణించిందని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ ఈయన ఆరోగ్యం గురించి ఎన్నో రకాల వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై సుధాకర్ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, నా ఆరోగ్యం గురించి వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమని అందులో నిజం లేదని ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి వచ్చే వార్తలను ఖండిస్తూ ఈయన చేసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…