Malli Pelli: మళ్లీ పెళ్లి ప్రస్తుతం సంచలనంగా మారిన ఈ సినిమా కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.స్టార్ సెలబ్రిటీలు కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినటువంటి నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని నరేష్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారని తెలుస్తోంది.
ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ పవిత్ర లోకేష్ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఈ సినిమాకు నరేష్ భార్య రమ్య రఘుపతి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.
ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చాలా అభ్యంతరంగా చిత్రీకరించారని ఈమె ఆరోపణలు చేస్తూ కూకట్పల్లిలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తన పాత్రను కించపరిచే విధంగా సన్నివేశాలు తీయడంతో ఈ సినిమా విడుదలకు తాను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని ఈ సినిమా విడుదలను ఆపివేయాలి అంటూ రమ్య రఘుపతి కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ విధంగా రమ్య రఘుపతి మళ్లీ పెళ్లి సినిమాని విడుదల చేయకూడదంటూ కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. మరి ఈ విషయంపై నరేష్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో రమ్య రఘుపతి పాత్రలో నటి వనిత విజయ్ కుమార్ నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…