Punch Prasad: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను కడుపుబ్బ నవ్వించారు. ఇలా కమెడియన్ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన గత కొంతకాలంగా తన రెండు కిడ్నీలో ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా ప్రసాద్ రెండు కిడ్నీలో ఫైల్ అవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటూ కిడ్నీ దాతల కోసం ఎదురుచూశారు. అయితే తనకు కిడ్నీ దొరికింది అంటూ ఒకానొక సమయంలో తన భార్య సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నూకరాజు సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ ఆరోగ్యం గురించి తెలియజేశారు.
రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రసాద్ అన్న కిడ్నీ ఫెయిల్యూర్స్ కారణంగా మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా తనని వెంటాడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుందని లేకపోతే ఏ క్షణం అయినా ఏదైనా జరగవచ్చు అంటూ డాక్టర్లు చెప్పారని నూకరాజు తెలిపారు.
ఇక డాక్టర్లు సర్జరీ చేయాలి అంటే భారీగా డబ్బు అవసరం అవుతుంది అందుకోసమే ఎవరైనా డబ్బు సహాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నామని నూకరాజు తెలిపారు. అంతేకాకుండా ఈయనకు ఎవరైనా తనకు ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే ఫోన్ పే నెంబర్ కి చేయొచ్చు అంటూ నెంబర్ ఇవ్వడమే కాకుండా తన భార్య బ్యాంక్ డీటెయిల్స్ అని కూడా ఈ వీడియోలో జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…