Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత ఈమె పూర్తిగా తన దృష్టిని కెరియర్ పై పెట్టారు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అయిన తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు.
ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో నటిస్తున్నారు. అలాగే సిటాడల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు ఈ రెండు కూడా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చాయి అయితే ఈ రెండు షూటింగ్ పూర్తి అయిన తర్వాత సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
సమంత ఇలా కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావించారట. అయితే ఈమె ఎందుకు సినిమాలకు దూరం అవ్వాలనుకుంటున్నారు అనే విషయానికి వస్తే గతంలో మయోసైటిస్ బారిన పడిన సమంతకు ఈ వ్యాధి మళ్లీ తిరగబడిందని అందుకే ఈమె కమిట్ అయిన సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇస్తుందని సమాచారం.
ఇలా మయోసైటిస్ తిరగబడటంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి పూర్తిగా ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని భావించారట అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీన్నిబట్టి చూస్తుంటే సమంత ఆరోగ్యం గురించి మరోసారి తాను అప్డేట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇలా సమంత తన ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు ముందుగానే చెప్పడంతో తన గురించి ఎలాంటి పుకార్లు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…