Ex IPS Narasaiah : లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకోవద్దని ఆయనకి ముందే చెప్పాను… ఆ పని వల్లే ప్రభుత్వం పడిపోయింది…: ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసయ్య

Ex IPS Narasaiah : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టిఆర్ గారు సినిమాల్లో నటించేటపుడు కంటే సీఎం గా ఉన్నపుడు జరిగిన ఆసక్తికర విషయాలను ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న మాజీ ఐపిఎస్ నరసయ్య గారు తాజాగా ఒక ఇంటర్వ్యులో తెలిపారు. ఆయన ఎంత భోలా మనిషో అలాగే తనతో ఉండేవాళ్లకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు వంటి విషయాలను అలాగే లక్ష్మి పార్వతి ఆయన జీవితంలోకి వచ్చాక ఏం జరిగింది వంటి విషయాలను ఇంటర్వ్యులో పంచుకున్నారు.

లక్ష్మి పార్వతి తో పెళ్ళి వద్దని చెప్పినా…

నరసయ్య గారు ఎన్టీఆర్ గారికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తూనే ఎన్టీఆర్ గారికి ఏదైనా విషయంలో సలహాలు కూడా ఇచ్చేవారట. అయితే ఆయన మనం ఇచ్చే సలహాలను ఒక్కోసారి వింటారు ఒక్కోసారి ఆయనకు నచ్చిందే చేస్తారు. లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు కూడా వద్దని ఆమెకు విడాకులు ఇప్పించి మరీ పెళ్లి చేసుకోకండి, ఈ వయసులో మీకు తోడు అవసరమే కానీ వేరే ఎవరైనా మీ వయసుకు తగ్గ ఒంటరి మహిళను చేసుకొండి అంటూ చెప్పారట.

అయితే ఆయన వినలేదని ఆమెనే చేసుకున్నారు అంటూ చెప్పారు. ఇక ఆయన ముఖ స్తుతికి పడిపోతారు. కొంతమంది ఆయనను దేవుడు అంటూ పొగిడి వారికి కావాల్సిన పనులు చేసుకునేవారు. అలానే ఒకసారి బడ్జెట్ లీక్ అవడంతో ఒక ఐఏఎస్ ఇచ్చిన సలహాతో మంత్రి వర్గాన్ని మొత్తం సస్పెండ్ చేసారు. అది తప్పుడు నిర్ణయం అంటూ చెప్పారు. దాని వల్ల ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఏర్పడింది అంటూ చెప్పారు.