Ap Politics: ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వర్మ… పవన్ గెలుపు సాధ్యమేనా?

Ap Politics: త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నానని ప్రకటించడంతో ఒక్కసారిగా పిఠాపురం భగ్గుమంది. టిడిపి జనసేన పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాము కచ్చితంగా ఓడిపోయేలా చేస్తామని వార్నింగ్ ఇవ్వడమే కాకుండా పార్టీ కార్యాలయం ముందు తెలుగుదేశం జెండాలు ఫ్లెక్సీలను కాల్చి బూడిద చేశారు. ఇలా పొత్తులో భాగంగా పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్నటువంటి వర్మ పై సస్పెన్షన్ వేటు వేశారు.

ఇలా తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా సస్పెన్షన్ వేటు వేయడంతో ఎలాగైనా జనసేనని ఓడించే దిశగానే వర్మ అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీత ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. కాపులు అధికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి తిరిగితే సునాయసంగా గెలుపొందొచ్చు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కు పిఠాపురం కేటాయించారు. కానీ ఇక్కడ టిడిపి వర్గీయుల నుంచి వ్యతిరేకత వచ్చింది.

స్వతంత్ర అభ్యర్థిగా వర్మ..
ఇక టిడిపి నేత అయినటువంటి వర్మకు టికెట్ రాకపోవడంతో ఈయనపై సస్పెన్షన్ వేటు పడటంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. మరి వర్మ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి వచ్చి పవన్ కళ్యాణ్ పై విజయం సాధిస్తారా లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా నిలబడి పవన్ కళ్యాణ్ ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతారా అనేది తెలియాల్సి ఉంది.