Nikhil: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నిఖిల్ సిద్ధార్థ ఒకరు. హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. కార్తికేయ2 సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నటువంటి నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నటువంటి నిఖిల్ ఇటీవల తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి మనకు తెలిసింది ఈయన 2021 సంవత్సరంలో డాక్టర్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇటీవల మగ బిడ్డ జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తనకు కొడుకు పుట్టాడని తిరిగి మానాన్నే వచ్చారు అంటూ నిఖిల్ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు.
ఈ విధంగా తల్లిదండ్రులుగా మారినటువంటి వీరిద్దరూ తాజాగా తమ కుమారుడికి మరో వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా నిఖిల్ పల్లవి కుమారుడికి బారసాల నామకరణ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించినటువంటి ఫోటోలను పల్లవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
నామకరణ వేడుక..
ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె నేడు తమ ముద్దుల కొడుకుకి బారసాల కార్యక్రమం నిర్వహించారు. తొలిసారి ఊయలలో వేయడం, నామకరణం లాంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయంటూ ఫోటోలను షేర్ చేశారు కానీ తమ కుమారుడికి ఏ పేరు పెట్టారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…