వ్యాక్సిన్ ఒక డోస్ వేసుకుంటే సరిపోతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికి పోతున్నాయి.ఇలాంటి తరుణంలో ఇండియాలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే,జనవరి నెలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే మొదటిదశలో 60 సంవత్సరాలు పైబడిన వారికి, రెండో దశలో 45 సంవత్సరాలు పైబడిన వారికి, మూడో దశ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా ఇలా కొత్త కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తూ భయాందోళనకి గురిచేస్తున్నాయి. ఈ వేరియంట్ల నుంచి రక్షణ పొందాలన్నా కూడా వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.కానీ ప్రస్తుతం మనదేశంలో కూడా వ్యాక్సిన్ కొరత ఉంది. ఈ కారణంగానే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న 6 నుంచి 8 వారాల్లో ఇవ్వాల్సిన రెండో డోసును 12 వారాల తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో కోవిడ్ -19 కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన ప్రస్తుత వ్యాక్సిన్ ఈ కొత్త వేరియంట్లు పైన సమర్థవంతంగా పని చేస్తుందా అనే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం వైరస్ మ్యూటేషన్ ఇలాగే కొనసాగితే ప్రస్తుత వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చనని అలాంటి ప్రమాదకర పరిస్థితి రాకముందే సరైన సమయానికి రెండు వ్యాక్సిన్ డోసులు వేయించుకోవడం ముఖ్యమని,కొత్త వేరియంట్ల వ్యాప్తిని ఒక్క వ్యాక్సిన్ డోస్ అడ్డుకోవడం కష్టమని సూచిస్తోంది.కనుక నిర్ణీత గడువులోపు రెండు డోస్ ల వాక్సిన్ పూర్తి చేసుకొని,కొత్త వేరియంట్లను అడ్డుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.