మల్లెమాల వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ మొదట్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా సుడిగాలి సుధీర్ యాంకర్ గా ఎంటర్ అవడంతో ఈ కార్యక్రమానికి అమాంతం క్రేజ్ పెరిగింది. జబర్దస్త్ కార్యక్రమం మాదిరిగానే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కూడా దూసుకుపోతోంది. ఈ షోలో భాగంగా సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించగా హైపర్ ఆది, గెటప్ శీను, సుధాకర్ వంటి జబర్దస్త్ కమెడియన్ తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. తాజాగా జులై 11 ఆదివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ ప్రోమోలో హైపర్ ఆది, గెటప్ శీను, సుధాకర్ కమెడియన్లు చేసిన కామెడీ అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఈ వారం కమెడియన్స్ అందరూ శ్రీమంతుడు సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకొనే కాన్సెప్టుతో చేశారు. ఈ కాన్సెప్ట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ శ్రీమంతుడు దర్శనమిచ్చాడు.పోరా శ్రీమంతుడా అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పృథ్విరాజ్ వచ్చి రాగానే తనదైన శైలిలో పంచ్ లు వేసి అందరిని నవ్వించారు.
ఈ విధంగా స్టేజ్ పైకి వచ్చిన పృథ్విరాజ్ వచ్చీరాగానే…. ఆది… వెనక నుంచి వచ్చానని కంగారు పడ్డావా? అని అడగగా అందుకు ఆది” మీరు వెనక నుంచి వస్తారని మాకు తెలుసు…కానీ మా కోసం వస్తారు అని మాత్రం తెలియదు అంటూ” తనదైన శైలిలో పంచ్ వేశాడు. అయితే గతంలో పృథ్వి రాజ్ ఎస్వీబీసీ చైర్మన్‌గా చేసిన పృధ్విరాజ్ ఓ మహిళతో ఫోన్ కాల్ అసభ్యకరంగా మాట్లాడుతూ దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఫోన్ కాల్ లో భాగంగా పృద్విరాజ్ మహిళతో వెనుక నుంచి వచ్చి పెట్టుకుందాం అనుకున్నా అంటూ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు లీక్ అవడంతో అప్పటినుంచి వెనకనుంచి పట్టుకొని పృథ్వి రాజ్ అయ్యాడు.అయితే ఈ వార్తలపై స్పందించిన పృథ్వీ రాజ్ కావాలని తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
ఈ విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమంలో ఓ స్కిట్లో భాగంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలోని ప్రజల సమస్యలను తీర్చి గ్రామ అభివృద్ధికి కృషి చేసే కాన్సెప్ట్ ద్వారా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే వచ్చే వారం వరకు ఎదురు చూడాల్సిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…