పేకాటకేసులో బయటపడిన నిజాలు.. నాగశౌర్య తండ్రికి నోటీసులు..!

హైదరాబాద్ నగర శివారులో ఆదివారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడులు జరపడంతో పేకాట రాయుళ్లు అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నిందితులు మొత్తం నాగసౌర్య పేరు మీద ఉన్నటువంటి ఫామ్ హౌస్ అరెస్టు కావడంతో ఈ కేసుకు నాగశౌర్యకి ఏమైనా సంబంధం ఉందా అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు విచారణలో భాగంగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

నగర శివార్లలో ఈ ఒక్క ఫాంహౌస్ లోనే కాకుండా అనేక ఫామ్ హౌస్ లలో ఈ విధమైనటువంటి దందా కొనసాగుతుందని నాగశౌర్య ఫాంహౌస్లో పట్టుబడిన గుత్తా సుమంత్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ క్రమంలోనే పోలీసులు సుమంత్ ఫోన్ చేయడంతో దిమ్మతిరిగిపోయే నిజాలు బయటపడుతున్నాయి.

సుమంత్ ప్రతి ఒక్క ఫామ్ హౌస్ కి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో సుమారు 200 మంది వరకు పేకాటరాయుళ్లు ఉన్నారని వీరందరూ కూడా బడాబాబులు అన్న విషయాన్ని పోలీసులు వెల్లడించారు.ఇక్కడికి పేకాట ఆడటానికి వచ్చే వారి కోసం అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

చిప్స్ తో నడిచే ఈ దందాలో కార్డ్ స్వైపింగ్, లిక్విడ్ క్యాష్ తో కూడా రావచ్చు అక్కడికి వచ్చే వారికి అన్ని ఫెసిలిటీస్ సుమంత్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ పేకాట వ్యవహారంలో బుజ్జి అనే వ్యక్తి పేరు బయటపడుతుంది. అసలు ఈ బుజ్జి ఎవరు అనే విషయానికి వస్తే ఈయన స్వయానా నాగసౌర్య బాబాయి.నాగ శౌర్య తండ్రి పేరు మీద ఫామ్ హౌస్ ఉన్నప్పటికీ ఆ ఫామ్ హౌస్ వ్యవహారాలన్నీ బుజ్జి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఫామ్ హౌస్ నాగశౌర్య తండ్రి పేరు మీద ఉండడంతో అతని తండ్రి పేరు పై పోలీసులు అతనికి నోటీసులను జారీ చేశారు.