పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం బుజ్జిగాడు. ఇందులో కన్నడ బ్యూటీ సంజనగల్రాని హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా జి వెంకట కృష్ణన్ దర్శకత్వంలో శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎస్ శంకర్రావు, ఆచార్య శ్రీనివాస రావు ఏం ఫణిభూషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న అటువంటి చిత్రం “మణిశంకర్”.
తాజాగా నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో హీరో శివ కంఠమనేని కత్తులతో ఉన్నటువంటి ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎన్నో అంచనాలను పెంచుతోంది.ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ మని శంకర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్ కు విశేష ఆదరణ లభిస్తుందని హీరో తెలియజేశారు.
ఇందులో సంజన గల్రాని, ప్రియా హెగ్దేలతో నటించడం ఎంతో ఆనందంగా ఉంది ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని హీరో తెలియజేశారు. ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్ , ప్లే దర్శకత్వం వహించిన జి. వెంకటకృష్ణన్ మాట్లాడుతూ ఒక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మణిశంకర్ అని ప్రస్తుతం షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని దర్శకుడు తెలియజేశారు. ఇక ఈ సినిమాకు ప్రభాకర్ రెడ్డి ఫోటోగ్రఫీ ఎంతో అద్భుతంగా ఉందని, ఈ సినిమాకు ఎం ఎల్ రాజా సంగీతం అద్భుతంగా వచ్చిందని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…