Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

Budget Session: పార్లమెంట్ లో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారంటూ.. బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా విమర్శించారు. 

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!
Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు తమ విభజన డిమాండ్ల సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు.

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

రాజ్యసభలో జీరో అవర్ లో రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలంటూ.. టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అవతున్నా… కేంద్ర ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఢిల్లీలో తెలంగాణ భవన్ కు భూమి, గిరిజన యూనివర్సీటీని ఏర్పాటు చేయలేదని కేంద్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని ..

మరోవైపు ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభలో జీరో అవర్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలని కేంద్రాన్ని కోరారు. పేపర్ లీక్, కోర్ట్ కేసులతో ఒక పరీక్ష మూడేళ్ల పాటు నడుస్తోందని… దీని వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.