MLA Roja: హోం టూర్ చేసిన ఎమ్మెల్యే రోజా..! రోజా ఇంద్ర భవనం మామూలుగా లేదుగా..!
MLA Roja: రోజా.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. తెలుగులో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందరో అగ్రహీరోలతో నటించింది రోజా. తెలుగులో చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జునతో పాటే కాకుండా తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా నటించి మెప్పించింది.
ప్రస్తుతం బుల్లితెర హోస్ట్ గా అలరించడంతో పాటే.. మరోవైపు పలు సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా ప్రజలకు సేవ చేస్తోంది. నగరి వైసీపీ ఎమ్మెల్యేగా తన ప్రజలకు అందుబాటులో ఉంటోంది.
అయితే ఇటీవల పలువురు సెలబ్రెటీలు తమ హోమ్ టూర్ నిర్వహించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మంచు లక్ష్మీ తన ఇంటితో పాటు మోహన్ బాబు ఇంటి హోం టూర్ నిర్వహించింది ఇంద్రభవనంలా ఉండే ఇళ్లను చూసి నెటిజెన్లు కూడా ఫిదా అవుతున్నారు.
తాజాగా ఎమ్మెల్యే రోజా కూడా తన ఇంటిని నెటిజెన్లకు, ప్రేక్షకులకు పరిచయం చేసింది. తిరుపతి గరిలో విలాసవంతమైన ఇంటిని నిర్మించుకుంది. ఈ క్రమంలో ఓ షో కోసం రోజా తన హెమ్ టూర్‌ని రిలీజ్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోతో ఇంట్లోకి స్వాగతం పలికిన రోజా.. ఇంట్లోని అన్ని రూములను ఫోటోలను అభిమానులతో పంచుకుంది. పూజాగది, బెడ్ రూమ్, హాల్ , పిల్లల రూమ్స్ ఇలా ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్టో వైరల్ అవుతున్నాయి. ఎంతో గ్రాండ్ గా నిర్మించుకున్న.. ఇంద్ర భవనం లాంటి ఇంటిని చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…