General News

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

Crime News: అక్రమ సంబంధాలు, వ్యసనాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కొంత మంది భార్యలు భర్తలను, పిల్లల్ని హత్య చేస్తుంటే…మరికొంతమంది భర్తలు భార్యల్ని కడతేరుస్తున్నారు. తాజాగా భార్యను చంపి నాటకం ఆడిన ఓ భర్త బండారం బట్టబయలైంది. సొంత మేనకోడలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ… భార్య అడ్డంగా ఉందని దారుణంగా హత్య చేశారు ఓ దుర్మార్గుడు. 

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొర పాలెం పంచాయతీలో జోడిమెరక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు(33).. భార్య లక్ష్మీని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మీతో నాగరాజుకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఏడు ఏళ్ల బాబు యశ్వంత్ ఉన్నాడు. అయితే వరసకు మేనకోడులు అయ్యే మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు నాగరాజు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్దల పంచాయతీ నిర్వహించి నాగరాజును మందలించారు.

దారిలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లి..

ఎలాగైనా భార్య లక్ష్మీని అడ్డు తొలగించుకోవాలనుకున్న నాగరాజు పథకం ప్రకారం జనవరి 28న రాత్రి 7.30 గంటలకు స్వీట్ షాప్ లో పని ముగించుకుని వస్తున్న నాగలక్ష్మీని తీర్థం పోదామని స్కూటీ ఎక్కించుకున్నాడు. అది నమ్మిన భార్య భర్త మాటలు విని బైక్ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్ స్కూల్ వైపు వెళ్లడంతో అనుమానం వచ్చిన లక్ష్మీ స్కూటీపై నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది. తిరిగి ఆమెను స్కూటీ ఎక్కించుకుని బలిఘట్టం రెవెన్యూ పరిధిలోని అర్థాన్న పాలెం దారిలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే తనకు విడాకులు ఇవ్వాలని లక్ష్మీని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బలంగా రాళ్లపైకి తోశాడు. దీంతో రాళ్లకుప్పపై పడి లక్ష్మీ స్పృహ కోల్పోయింది. ఇదే అదునుగా పెద్ద బండరాయితో మోదీ లక్ష్మీని హత్య చేశాడు నాగరాజు. అక్కడే ఉన్న ఎండుపుల్లలు వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు నాగరాజు. భార్యను హత్య చేసిన నాగరాజును ఉరితీయాలంటూ.. గ్రామస్థులు ధర్నా చేశారు. పోలీస్ స్టేషన్ కు ర్యాలీ తీశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago