Geetha Krishna : రాజమౌళి ప్రచారం చేసినంత మాత్రాన సినిమా హిట్ అయిపోదు…!

Geetha Krishna : తెలుగులో కోకిల, సంకీర్తన వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గీత కృష్ణ ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలతో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తేడా లేకుండా అందరిపైన విమర్శలు చేస్తూ తెగ వైరల్ అవుతున్నాడు. మొన్నామధ్య చిరంజీవి రీమేకులనే నమ్ముకున్నాడు అంటూ మాట్లాడాడు. ఇక దర్శకులను వదల్లేదు, బోయపాటి ఎవరో తెలియదు అంటూ మాట్లాడాడు, విసుర్లతో రెచ్చిపోతున్నాడు. ఇక తాజాగా రాజమౌళి మీద పడ్డాడు.

రాజమౌళి ప్రచారం చేస్తే బ్రహ్మాస్త్రా హిట్ అవుతుందా…

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో బ్రహ్మాస్త్రా సినిమా ప్రచారాలను టాలీవుడ్ లో కూడా నిర్వహించడంపై ప్రశ్నించగా, రాజమౌళి బ్రాండు ను ఉపయోగించుకుని తెలుగులో హిందీ సినిమాను హిట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. రాజమౌళి ఇంతకుముందు బాహుబలి, ఆర్ఆర్ఆర్ సమయంలో కరణ్ జోహార్ ద్వారా బాలీవుడ్ లో ప్రచారం చేసాడు. అందుకే ఇపుడు ఇక్కడ వాళ్ళ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. రాజమౌళి ప్రమోట్ చేసినంత మాత్రాన సినిమా హిట్ అవ్వదు. సినిమాలో నిజంగా కంటెంట్ ఉంటే ఎవరి ప్రొమోషన్స్ అక్కర్లేదు. రాజమౌళి ప్రొమోషన్స్ సినిమా మొదటి రోజుకి పనికి వస్తుంది. ఇక ఆతరువాత సినిమా బాగుంటేనే ఆడుతుంది లేదంటే లేదు. సినిమా హిట్ అవ్వడం ప్రేక్షకుల కు నచ్చిందా లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

అమితాబ్ బచ్చన్ ను పెట్టుకున్నంత మాత్రాన చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా హిట్ అయ్యిందా.. అవ్వలేదు కదా. పాన్ ఇండియా అంటూ ఇతర భాష నటులను తీసుకోవడం తప్పు కాదు, అయితే కథలో కంటెంట్ లేకపోతే ఎంతమంది గొప్ప ఆర్టిస్టులు ఉన్నా సినిమా హిట్ అవ్వదు. ఒకవేళ బ్రహ్మాస్త్రా సినిమాలో కంటెంట్ బాగుంటే హిట్ అవుతుంది. లేదంటే రాజమౌళి ప్రమోట్ చేసినా హిట్ అవ్వదు అంటూ కామెంట్ చేసారు.