క్రికెట్ అభిమానులు పండగ చేసుకునే వార్త.. ఏంటంటే..

గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి అభిమానులు సందడి చేస్తున్నారు. ఐపీఎల్ అయిపోగానే వెంటనే టీ20 వరల్డ్ కప్ వచ్చింది. తర్వాత వెంటనే మళ్లీ న్యూజిలాండ్ తో టీ20 మరియు టెస్టు ఆడనున్నారు. 2022 ఆస్ట్రేలియా వేదికగా మరో టీ20 వరల్డ్ కప్ సమరం ఉండనుంది.

మళ్లీ మరుసటి సంవత్సరం 2023 లో వన్డే వరల్డ్ కప్ మన భారతదేశం వేదిక కానుంది. అయితే తాజాగా 2024లో నిర్వహించే క్రికెట్ కు సంబంధించి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరుగనున్నట్లు ట్విట్టర్ వేదిక ద్వారా ప్రకటించారు. 2024 టీ 20 వరల్డ్‌ కప్‌ యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ లో జరుగనుంది.

2025 చాంపియన్‌ ట్రోపికి పాకిస్తాన్‌ వేదిక కానుంది. ఇక 2026 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియా, శ్రీలంక లో జరుగనుంది. ఇక 2027 వరల్డ్‌ కప్‌ కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. అలాగే… 2028 టీ20 వరల్డ్‌ కప్‌ ఆసీస్‌, న్యూజిలాండ్‌ దేశాలు వేదికలు కానున్నాయి. 2029 లో చాంపియన్‌ ట్రోఫికి ఇండియా వేదిక కానుంది.

2030 టీ 20 వరల్డ్‌ కప్‌కు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ లు వేదికలు కానున్నాయి. 2031 వరల్డ్‌ కప్‌ కు ఇండియా, బంగ్లా దేశ్ దేశాలు వేదికలు కానున్నాయి. ఈ కొత్త వేదికలు.. టైం టేబుల్ లతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారమే వారి వారి వ్యక్తిగత పనులను చేసుకునేందుకు అవకాశం ఉండనుంది.