సూర్యుడు తూర్పున ఉదయించిన దగ్గర నుంచి పడమర అస్తమించే వరకు ప్రతీ ఒక్కరు వివిధ రకాల పనులు చేస్తుంటారు. ఆ రోజంతా పనుల్లోనే బిజీ అయిపోతుంటారు. ఇంటి పనులు చేసేవాళ్ల దగ్గర నుంచి ఆఫీస్ పనులు చేసే వాళ్ల వరకు ఎవరి దారి వాళ్లదే అన్నట్లు ఉంటారు. ఇక సూర్యుడు అస్తమించగానే.. ఇళ్లల్లోకి వచ్చి చేరుతుంటారు.
ఇలా వారి జీవన గమనం సాగుతుంది. అయితే సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను చేయకూడదట. ఆ విషయాలు చాలా మందికి తెలియదు. వాస్తు శాస్త్రం ప్రకారం అవేంటో తెలుసుకుందాం.. ముఖ్యంగా గోళ్లు కత్తిరించుకోవడం.. జుట్టు కత్తిరించుకోవడం పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ మైండ్ కాకుండా నెగెటివ్ మైండ్ తో కుటుంబసభ్యులు ఉంటారట.
ఉప్పును సాయంత్రం అయిన తర్వాత ఇతరులకు దానం చేయకూడదు. అంతే కాదు ఇంటిని శుభ్రం కూడా చేయకూడదట. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందనే నానుడి ఉంది. అందుకే చాలామంది ఉదయమే పనులను చేసుకుంటారు. ఇక అంత్యక్రియలను కూడా సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు అని పెద్దలు చెబుతుంటారు.
ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మ క్షోభకు గురవుతుందని చెబుతుంటారు. వారికి మరో జన్మ అనేది ఉండదట. ఇక చివరగా సూర్యుడు పడమర అస్తమించిన తర్వాత నిద్ర పోకూడదట. ఇలా చేస్తే అష్ట దరిద్రం అంతా ఇంట్లోనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పైన చెప్పిన విధంగా సూర్యాస్తమయం తర్వాత వాటికి దూరంగా ఉంటే లక్ష్మీ మీ ఇంట్లోకి వచ్చేసినట్లే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…