Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !

Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !

Edible Oil Prices: గత కొన్ని రోజులుగా సామాన్యుడికి వంటనూనెల రేట్లు చుక్కలు చూపెడుతున్నాయి. ఒక లీటర్ నూనె ప్యాకెట్ ధర వంద రూపాయలను మించి పోయింది. దీంతో నూనెల రేట్ల వల్ల సామాన్యుడు చాలా ఇబ్బందలు పడుతున్నాడు. దేశంలో నూనె గింజల సాగు, ఉత్పత్తి తక్కువగా ఉండటంతో పాటు పామాయిల్ ను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో.. నూనెల రేట్లు పెరుగుతున్నాయి. 

Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !
Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !

కాగా తాజాగా సామాన్య ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కేంద్రం వంట నూనెల దిగుమతి సుంకాలు తగ్గించడంతో.. ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. క్రూడాయిల్ పామాయిల్ దిగుమతిపై సుంకాలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.

Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !

ఈ నిర్ణయం వల్ల ఇండియాలో పెరుగుతున్న వంట నూనెల ధరలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కేంద్రం ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 8.25 శాతం నుంచి 5.5శాతానికి తగ్గించింది. ఇక ముడివ పామాయిల్ పూ ప్రాథమిక కస్టమ్స్ సుంకం జీరో చేసింది.

క్రూడ్ ఆయిల్ పై తగ్గించిన సుంకాన్ని …

ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ నోటిఫికేషన్ ద్వారా అగ్రి ఇన్ ఫ్రా డెవలప్మెంట్ సెస్ ని ఫిబ్రవరి 13 నుంచి 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. క్రూడ్ ఆయిల్ పై తగ్గించిన సుంకాన్ని సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలలు పాటు పొడగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక శుద్ది చేసిన పామ్ ఆయిల్ పూ ఇంపోర్ట్ డ్యూటీ 13.75 శాతంగా ఉంది. గత సంవత్సరం నుంచి వంట నూనెల ధరలు దేశంలో అధికంగా ఉన్నాయి. దీన్ని తగ్గించేందుకు దేశీయంగా లభ్యత పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం పలుమార్లు పామాయిల్ పై దిగుమతి సుంకాలను తగ్గించుకుంటూ వస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశీయ రిఫైనరీలు స్వాగతించాయి.