Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !
Edible Oil Prices: గత కొన్ని రోజులుగా సామాన్యుడికి వంటనూనెల రేట్లు చుక్కలు చూపెడుతున్నాయి. ఒక లీటర్ నూనె ప్యాకెట్ ధర వంద రూపాయలను మించి పోయింది. దీంతో నూనెల రేట్ల వల్ల సామాన్యుడు చాలా ఇబ్బందలు పడుతున్నాడు. దేశంలో నూనె గింజల సాగు, ఉత్పత్తి తక్కువగా ఉండటంతో పాటు పామాయిల్ ను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో.. నూనెల రేట్లు పెరుగుతున్నాయి.
కాగా తాజాగా సామాన్య ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కేంద్రం వంట నూనెల దిగుమతి సుంకాలు తగ్గించడంతో.. ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. క్రూడాయిల్ పామాయిల్ దిగుమతిపై సుంకాలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.
ఈ నిర్ణయం వల్ల ఇండియాలో పెరుగుతున్న వంట నూనెల ధరలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కేంద్రం ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 8.25 శాతం నుంచి 5.5శాతానికి తగ్గించింది. ఇక ముడివ పామాయిల్ పూ ప్రాథమిక కస్టమ్స్ సుంకం జీరో చేసింది.
ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ నోటిఫికేషన్ ద్వారా అగ్రి ఇన్ ఫ్రా డెవలప్మెంట్ సెస్ ని ఫిబ్రవరి 13 నుంచి 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. క్రూడ్ ఆయిల్ పై తగ్గించిన సుంకాన్ని సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలలు పాటు పొడగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక శుద్ది చేసిన పామ్ ఆయిల్ పూ ఇంపోర్ట్ డ్యూటీ 13.75 శాతంగా ఉంది. గత సంవత్సరం నుంచి వంట నూనెల ధరలు దేశంలో అధికంగా ఉన్నాయి. దీన్ని తగ్గించేందుకు దేశీయంగా లభ్యత పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం పలుమార్లు పామాయిల్ పై దిగుమతి సుంకాలను తగ్గించుకుంటూ వస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశీయ రిఫైనరీలు స్వాగతించాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…