AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

AP Breaking News: కాపు సామాజిక వర్గానికి జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి కేసులను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ సామాజిక వర్గానికి ఊరట కలగనుంది. ఈ మేరకు జీవో ను కూడా విడుదల చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ బిశ్వజిత్ ఈ జీవోను విడుదల చేశారు.

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!
AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

జీవోలో కేసుకు సంబంధించిన వివరాలు… అందుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల జాబితా ప్రకటించారు.
2014 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా… తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది.  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తుని లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అల్లర్లలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు తగలబెట్టారు. దీంతో ఈ ఘర్షణలకు కారణమైన వారి పైన వివిధ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తుని బహిరంగ సభ తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి.

రైలును తగలబెట్టడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం వంటి ఘర్షణలపై కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ లా అమెండ్మెంట్, ఐపీసీ సెక్షన్ ల కింద ఈ కేసులు పెట్టారు. ఐపీసీ లోని 109, 143, 147, 148, 149, 427, 435 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.


హోమ్ మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ..

2019లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపు ఉద్యమంపై నమోదైన కేసులను ఉపసంహరించడం మొదలుపెట్టింది. 2019 మార్చి వరకు తొలి దశలో తొలి బహిరంగ సభ రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన కేసులను ఉపసంహరించుకున్నారు. 2020లో దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఆ తర్వాత 2016 జనవరి నుంచి 2019 వరకు నమోదయిన కేసులు అన్నింటిని ఎత్తివేస్తూ హోమ్ మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తుని ఘటనకు సంబంధించిన కేసులు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సంబంధిత కేసులన్నింటినీ ఉపసంహరించుకున్నట్లు బిశ్వజిత్ తెలిపారు. 2019 మార్చి వరకు 161 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎల్ పోలవరం, కాట్రేనికోన, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, పి గన్నవరం, రాజోలు, నగరం, మచిలిపురం, బిక్కవోలు, గుంటూరు జిల్లా లాలాపేట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిని ప్రస్తుతం ఎత్తివేశారు.