Actress Hema: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కగా, పిన్నిగా, వదినగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి హేమ గురించి అందరికీ తెలిసిందే. ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న హేమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ కెరియర్ మొదట్లో ప్రొడక్షన్ బాయ్స్ చిన్న ఆర్టిస్టులను చాలా చులకనగా చూసేవారని… ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కేరవాన్ సదుపాయం ఉందని అప్పట్లో ఏ విధమైనటువంటి సదుపాయాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.
షూటింగ్ లొకేషన్ లో బట్టలు మార్చుకోవాలన్నా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని… అప్పుడు ఇలాంటి వసతులూ ఉండేవి కాదని తెలిపారు.ఈ క్రమంలోనే భారతనారి అనే సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో అందరితో కలిసి భోజనం చేస్తుండగా ప్రొడక్షన్ బాయ్ వచ్చి మీరు ఇక్కడ కాదు భోజనం చేయాల్సింది అక్కడికి వెళ్లి భోజనం చేయండి అంటూ అందరి ముందు తనని అవమాన పరిచారని హేమ గత సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
ఈ విధంగా భోజనం ముందు నుంచి లేపడంతో చాలా కోపం వచ్చిందని ఏకంగా టేబుల్ ఎత్తి తనపై వేద్దామా అని కోపంతో రగిలిపోయానని ఎప్పటికైనా వీరందరితో పాటు కలిసి భోజనం చేయాలని ఎంతో కష్టపడ్డానని హేమ తెలియజేశారు.అయితే ఇప్పటికి ఆ ప్రొడక్షన్ బాయ్ ఇండస్ట్రీలో ఉన్నారని కానీ ఒక సినిమా షూటింగ్ సమయంలో తనే స్వయంగా వచ్చి నాకు భోజనం కూడా వడ్డించారని తెలిపారు. ఇలా ఈ చేదు సంఘటనలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని హేమ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…