దొంగను పట్టించిన గూగుల్ యాప్… ఎలాగంటే?

కొన్నిసార్లు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ భాష రాకపోవడంతో నానా అవస్థలు పడుతుంటారు. అలా భాష రాకపోవడంతో ఏకంగా పోలీసుల చేతిలో ఇద్దరు వ్యక్తులు అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఈ అరుదైన సంఘటన ఇంగ్లాండ్ మహానగరంలోని లండన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

ఎప్పటిలాగే లండన్ లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ అధికారులకు ఒక కారు నుంచి పెద్ద మొత్తంలో గంజాయి వాసన రావడంతో అనుమానం వచ్చి ఆ కారును ఆపి తనిఖీ చేశారు. కారు మొత్తం వెతికినా ఎక్కడ వారికి గంజాయి కనిపించలేదు. కారులో ఎటువంటి గంజాయి లేకపోయినా వారిపై పోలీసులకు అనుమానం తీర లేదు. అయితే కారులో కూర్చుని ఉన్న ఇద్దరు వ్యక్తుల పై అనుమానం రావడంతో వారిని కూడా వెతికారు. వారి దగ్గర కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో పోలీసులు పొరపాటు పడ్డట్టే భావించారు.

ఆ సమయంలో పొరపాటు పడిన పోలీస్ అధికారులు వారికి ఇంగ్లీషులో క్షమాపణ చెప్పి, వారికి అనుమానం రావడానికి గల కారణాలు చెబుతున్న సమయంలో అసలు గుట్టు బయట పడింది.కారులో ఉన్న వ్యక్తులకు ఇంగ్లీషు రాకపోవడంతో పోలీసులు ఏం చెబుతున్నారో తెలుసుకోవడానికి తన ఫోన్ ఆన్ చేసి గూగుల్ ట్రాన్స్ లేషన్ యాప్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారి ఫోన్ లో ఒక వీడియో ప్లే అయింది. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు గంజాయి పెంచుతున్న తోట వీడియో ప్లే కావడంతో వాళ్ల దగ్గర నుంచి ఫోన్ లాక్కుని వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ను తనిఖీలు చేసి అక్కడ పెంచుతున్న 300 గంజాయి మొక్కలను సీజ్ చేసి వారిని అరెస్టు చేశారు.ఈ విధంగా గూగుల్ యాప్ ఆ దొంగలను పట్టించడంలో ఎంతో సహాయపడుతుందని చెప్పవచ్చు.