ప్రేమ గుడ్డిదని, ప్రేమ మాయలో పడితే ఎంతటి సాహసానికైనా ఒడిగడతారని ఇది మనం వినే ఉంటాం. అచ్చం అలాగే ఓ కుర్రాడు దూరంగా ఉన్న తన ప్రియురాలి కోసం ఓ పెద్ద సాహసం చేశాడు. తన ప్రియురాలిని చూడడానికి ఏకంగా సముద్రాలు దాటి వెళ్ళాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ప్రియురాలిని చూడటానికి వెళితే జైల్లో ఎందుకు పెట్టారో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
స్కాట్లాండ్‌కు చెందిన 28 ఏళ్ల డేల్ మెక్‌లాగన్ అతను జెస్సికా రెడ్ క్లిఫ్ కానీ అమ్మాయిని ప్రేమించాడు.ఐరీష్ సముద్రంలోని ‘ఐల్ ఆఫ్ మన్’ దీవిలో గత సంవత్సరం పని చేయడానికి వెళ్లిన అతను అక్కడే ఉన్న జెస్సికాతో ప్రేమలో పడ్డాడు. అయితే అతని పని కాంట్రాక్ అయిపోవడంతో తిరిగి తన స్వస్థలానికి వెళ్లిన మెక్‌లాగన్ తన ప్రేయసి మీద బెంగతో ఎలాగైనా తనని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
‘ఐల్ ఆఫ్ మన్’ దీవిలో ఉన్న తన ప్రేయసిని కలుసుకోవడానికి అధికారులను అనుమతి కోరగ అందుకు వారు తిరస్కరించారు. ఎలాగైనా తన ప్రేయసిని కలుసుకోవాలని ఏకంగా ఓ జెట్ స్కై కొనుక్కొని తన ప్రేయసి కోసం బయలుదేరాడు. అయితే జెట్ స్కై నడవడం అలవాటు లేని కారణంగా అతని ప్రయాణం నాలుగు గంటల పాటు సాగింది. ఎంతో కష్టపడి తన ప్రేయసిని కలుసుకుని మాట్లాడారు.తరువాత నైట్ ఇద్దరు కలిసి క్లబ్ కి వెళ్లడంతో అక్కడ పోలీసుల కంటపడటంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి,కోవిడ్ నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి నగరం దాటి వచ్చిన అతనిని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. దీంతో కోర్టు అతనికి నాలుగు వారాల పాటు జైలు శిక్షను విధించింది. అయితే ప్రస్తుతం మెక్‌లాగన్ తన ప్రేయసి కోసం చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అతనిని ఒక రోమియో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…