సాధారణంగా ప్రతి రోజూ మనం ఎన్నో మరణవార్తను గురించి వినే ఉంటాం. అందులో అనారోగ్య సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, కుటుంబ సమస్యల కారణంగా ఎంతోమంది మరణించిన సంఘటనలు ఎన్నో చూసాం. కానీ ఇంగ్లాండ్ లో మాత్రం వింత మరణం సంభవించింది. కేవలం కాలుష్యం కారణంగా 9 సంవత్సరాల బాలిక తన ప్రాణాలను కోల్పోయినట్లు దర్యాప్తులో తేలింది.పూర్తి వివరాలతో వెళ్తే…
ఇంగ్లండ్‌లో ఓ బిజీ రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లో నివసించే అడూ కిస్సి డెబ్రా అనే 9ఏళ్ల బాలిక కాలుష్యం కారణంగా మృతి చెందినట్లు స్థానిక కరోనర్ అధికారి లెలిపారు. తాను నివాసముండే ఇల్లు రోడ్డు పక్కనే ఉండడంతో ఎప్పుడూ ఎంతో రద్దీగా ఉండే ఆ రోడ్డు నుంచి వెళ్లే వాహనాల ద్వారా ఎక్కువ కాలుష్యం అవడంతో తరచూ డెబ్రా ఆస్తమాకు గురయ్యేది. ఆస్తమాతో బాధపడుతున్న తనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కానీ ఆ బాలికకు ఎందుకు అలా అవుతుందో అనే విషయం గురించి ఎవరు ఆరా తీయకపోవడంతో చివరికి తాను మరణించింది.
2013లో డెబ్రాకు ఆస్తమా ఎటాక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో డెబ్రా మరణించింది. ఆ బాలిక మృతిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కాలుష్యం కారణంగా ఆమె మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడించారు.చరిత్రలోనే తొలిసారిగా ఇలా కాలుష్యం కారణంగా మరణించినట్లు తేలడంతో కాలుష్యం పై ఎన్నో ఉద్యమ సంఘాలు దండెత్తి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వాయు కాలుష్యం పై చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు.
డెబ్రా నివసించే ప్రాంతంలో వాహనాలు ఎక్కువగా తిరగడం వల్ల, వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్ వాయువులు పీల్చుకోవడం ఆ బాలిక మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ వాయు కాలుష్యం వల్ల డెబ్రావంటి ఎంతోమంది ఆస్తమా పేషెంట్లకు తీవ్ర సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…