Gummadi : ఎన్.టి. రామారావు ఇచ్చిన మాటతో గుమ్మడి తిరుగులేని నటుడిగా ఎదిగి పద్మశ్రీ అందుకున్నారు.

Gummadi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు. కెరీర్ ప్రారంభంలో విలన్, స్నేహితుడు, సహయాక పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తండ్రి, తాత పాత్రలకు ఆయనే బెస్ట్ ఛాయిస్ అని దర్శక, నిర్మాతలు భావించారు. అలా ఆయన 500 చిత్రాలలో చక్కటి పాత్రలు పోషించారు.  పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఇలా అన్ని రకాలైన సినిమాల్లో గుమ్మడికి అవకాశాలు దక్కాయి.

Gummadi :ఎన్.టి. రామారావు ఇచ్చిన మాటతో గుమ్మడి తిరుగులేని నటుడిగా ఎదిగి పద్మశ్రీ అందుకున్నారు.

గుమ్మడి వెంకటేశ్వరరావు అసలు పేరైనప్పటికి ఇంటిపేరుతోనే ఆయన క్రేజీ స్టార్‌గా మారారు. నటుడవ్వాలని ఆసక్తి ఉన్నా కూడా ఆయన సినిమా రంగ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. అవకాశాల కోసం ఎదురు చూడని సమయంలో నటించే  అవకాశం దక్కింది. లక్షమ్మ, శ్రీలక్షమ్మ పేరుతో పోటీ చిత్రాలు ప్రారంభమయ్యాయి. లక్షమ్మ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు, అలనాటి కథానాయిక కృష్ణవేణి నిర్మాత. ఇక శ్రీలక్షమ్మ చిత్రానికి ఘంటసాల రఘురామయ్య దర్శక నిర్మాత కాగా, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి జంటగా నటించారు. అందులో ఒక పాత్రకు గుమ్మడికి అవకాశం ఇవ్వమని సిఫారసు చేసారు. సరేనన్నప్పటికీ అవకాశం మాత్రం ఇవ్వలేదు.

Gummadi : గుమ్మడికి మాట ఇచ్చిన ఎన్టీ రామారావు :

అయితే గుమ్మడి ప్రయత్నాలు మాత్రం మానలేదు. తెలిసిన వారి ద్వారానే మద్రాసు చేరుకున్నారు. ఈ క్రమంలో అదృష్టదీపుడు అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసే అవకాశం అందుకున్నారు. ఈ సినిమా 1950 లో వచ్చింది. అయితే గుమ్మడి కెరీర్ ప్రారంభంలో అంత సాఫీగా సాగలేదు. చేసిన సినిమాలలో చిన చిన్న పాత్రలు కావడం..దాంతో అంతగా గుర్తింపు దక్కకపోయేసరికి నాకు ఇండస్ట్రీ సరిపడదని తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఎన్.టి. రామారావు.. మీరు ఎక్కడికీ వెళ్ళొద్దని.. నా తరువాత సినిమాలో మంచి వేషం ఇస్తానని మాటిచ్చారు.  

ఎన్.టి.రామారావు ఇచ్చిన మాట ప్రకారమే గుమ్మడికి ఆయన నటించిన పిచ్చిపుల్లయ్య సినిమాలో విలన్ పాత్ర ఇచ్చారు. ఈ పాత్రతో గుమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమా తర్వాత మళ్ళీ కూడా ఎన్.టి.రామారావు నటించిన తరువాతి చిత్రం తోడుదొంగలు లోనూ ప్రధాన పాత్ర అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కించుకుంది.

అలా గుమ్మడి కెరీర్ సక్సెస్ కావడానికి ఎన్.టి. రామారావు ప్రధాన కారణమయ్యారు. వాస్తవంగా రామారావు, నాగేశ్వరరావుల కంటే గుమ్మడి వయసులో చిన్నవాడు. అయినా చాలా చిత్రాలలో వీరిద్దరికి తండ్రిగా, మామగా నటించడం విశేషం. వశిష్ట, విశ్వామిత్ర పాత్రలతో గుమ్మడికి గొప్ప పేరు వచ్చింది. దశరథునిగా, భీష్మునిగా,ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు, భృగుమహర్షి, వంటి పౌరాణిక పాత్రలు ఆయన కోసమే తయారయ్యాయా అని చెప్పుకున్నారు. ఇక కమర్షియల్ సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించారు.