Sukuamar: పెళ్లైన కొత్తలో తాను అలా ఉండేవాడిని..! ఆ విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్..!

Sukuamar: పెళ్లైన కొత్తలో తాను అలా ఉండేవాడిని..! ఆ విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్..!

Sukuamar: సంక్రాంతి పండగ పేరు చెప్తే వెంటనే గుర్తుకు వచ్చేది కోనసీమ, కోస్తా జిల్లాలు.  అక్కడ సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతాయి. కోడి పందాలు, ఇంటి ముందు ముత్యాల ముగ్గులు, ఆడపడుచుల అందాలు, కొబ్బరి తోటలు గుర్తుకు వస్తాయి. కోస్తా జిల్లాల ప్రజలు ఎక్కడ ఉన్నా సంక్రాంతికి సొతూళ్లకు వెళ్ళడం ఆనవాయితీ. సంక్రాంతిని పెద్ద పండుగ చెబుతుంటారు వారంతా.

Sukuamar: పెళ్లైన కొత్తలో తాను అలా ఉండేవాడిని..! ఆ విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్..!
Sukuamar: పెళ్లైన కొత్తలో తాను అలా ఉండేవాడిని..! ఆ విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్..!

కాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా తన సంక్రాంతి అనుభవాలను పంచుకున్నారు. చిన్నతనంలో చేసిన సందడి.. పెళ్లయిన తర్వాత వచ్చిన మార్పుల గురించి వివరించారు. సుకుమార్ సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం దగ్గర్లో ఉన్న మట్టపర్రు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే తీర్థాలు, కోడి పందాలు.

Sukuamar: పెళ్లైన కొత్తలో తాను అలా ఉండేవాడిని..! ఆ విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్..!

అయితే సుకుమార్ ఊరుకు దగ్గర్లో శివకోడు ముసలమ్మ తీర్థం జరిగేదట. అక్కడ పెద్ద సంత జరుగుతుందట. ఆ సమయంలో ఒక పెద్ద నాన్నకి తెలియకుండా మరో పెదనాన్న ఇచ్చే జీడిపాకం రుచి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంతలో ఏమైనా కొనుక్కోమని తన తల్లి ఇచ్చే డబ్బులను తీసుకొని.. ఆమెకే పకోడీ ఖర్జూరం కొనిచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు సుకుమార్.

వేసవిలో తన సినిమాలను విడుదల చేసే సుకుమార్..

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి ప్రస్తావించారు. తన భార్య, తల్లి మధ్య యాస వల్ల వచ్చిన ఇబ్బందులను చెప్పుకొచ్చారు. తన భార్య తబిత ది తెలంగాణ, తల్లిగారి ది పక్క గోదావరని.. దీంతో ఇద్దరి మధ్యలో మాట్లాడేటప్పుడు యాస సమస్యగా మారిందని చెప్పుకొచ్చారు సుకుమార్. పెళ్లయిన ఏడాది సంక్రాంతికి సొంతూరు వెళ్ళినప్పుడు తన తల్లి గారు చెప్పే మాటలు తన భార్య తబితకు అర్థం కాకపోయేవని.. దీంతో వీరిద్దరి మధ్య ట్రాన్స్లేటర్ గా కొత్త అవతారం ఎత్తారట సుకుమార్. సంక్రాంతి సమయంలో తన భార్యకు ఊరంతా తిప్పి చూపానని చెప్పుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ అయ్యాక జరుపుకుంటున్న సంక్రాంతి ‘వన్’ సమయంలోనే చెప్పారు. సాధారణంగా సుకుమార్ వేసవి సమయంలో తన సినిమాలను విడుదల చేస్తుంటారు. దీంతో సంక్రాంతి సమయంలో వర్క్ లోడ్ ఎక్కువగా ఉండేది. అయితే ‘వన్’ విషయంలో సంక్రాంతి సమయానికి సినిమా స్టార్ట్ అవ్వలేదు. దీంతో సొంతూరు వెళ్లి సంక్రాంతి హ్యాపీ గా జరుపుకున్నారని తెలిపారు సుకుమార్.