Bigg Breaking: సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం..! రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..!
Bigg Breaking: కొన్ని గంటల క్రితం తెల్లవారుజామున సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో మంటలు విపరీతంగా చెలరేగడంతో వారసత్వ కట్టడం ధ్వంసమైంది. ఆ క్లబ్ యొక్క ప్రధాన ముఖభాగం మంటల్లో కాలిపోయింది.షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం.
ప్రాథమిక విచారణలో దాదాపు రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ క్లబ్‌లో ఆదివారం (16 జనవరి, 2022) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు 10 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటలు భారీగా ఎగిసిపడగా, అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు 3 గంటల సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సికింద్రాబాద్ క్లబ్ 1879లో బ్రిటిష్ పాలనలో సైనిక అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఎలైట్ క్లబ్ 30 ఎకరాల విశాలమైన క్యాంపస్‌లో విస్తరించి ఉంది. ఇక్కడ 5000 మంది సభ్యులకు సభ్యత్వం ఉంది. సికింద్రాబాద్ క్లబ్‌లో దాదాపు 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని అక్కడి అధికారులు చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా సికింద్రాబాద్ క్లబ్ చాలా రోజులుగా క్లోజ్ చేసి ఉంది. కరోనా ప్యాండమిక్ కారణంగా చాలా రోజులుగా క్లోజ్ ఉన్న క్లబ్ లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరుగలేదు. కేసు నమోదు చేసుకున్న మారేడ్ పల్లి పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. అక్కడ ప్రాంతంలో రాకపోకలు అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…