Singers Dance Show: అక్కాచెల్లెళ్ల డ్యాన్స్ తో నెటిజన్లు ఫిదా..! మీరూ ఓ లుక్కేయండి..!
Singers Dance Show: సింగర్ మంగ్లీ.. పేరు తెలియని వారు ఉండరు. ఎక్కువగా బతుకమ్మ సాంగ్స్ పాడుతూ బాగా పాపులర్ అయ్యారు. తర్వాత ఆమె ట్యాలెంట్ ను చూసి ఎన్నో సినిమాల్లో పాటలు పాడేందుకు అవకాశం ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి ఎన్నో ఫోక్ సాంగ్స్ ను పాడింది.
ఇలా ఆమె తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలు. ఇటీవల ఆమె కవర్ సాంగ్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ పుష్పలోని సమంత చేసిన ఐటం సాంగ్ ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ అనే చెప్పాలి.
ఎందుకంటే.. ఆ సాంగ్ ప్రతీ ఒక్కరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఐటెం సాంగ్స్ ను కంపోజ్ చేయడంలో తనకు తిరుగులేదని మరో సారి నిరూపించారు దేవీ శ్రీ ప్రాసాద్. అయితే పుష్పలోని ఈ సాంగ్ ను పాడటానికి మంగ్లి సోదరికి అవకాశం ఇచ్చాడు డీఎస్పీ.
దీంతో ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్ ఈ సాంగ్ పాడి.. ఓవర్ నైట్ లో స్టార్డం వచ్చింది. ఈ పాటతోనే ఇంద్రావతి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది. మంగ్లీకి మాత్రం కన్నడలో అవకాశం ఇచ్చాడు డీఎస్పీ. ఇక ఎక్కువగా ఇంద్రావతి వాయిస్ కంటే.. ఆమె ఆ పాటలో పాడుతూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఇలా మంగ్లీ, ఇంద్రావతి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. ఇక తాజాగా వీళ్లిద్దరు కలిసి రీల్ వీడియో చేశారు. ఇన్ స్టాగ్రాంలో ఈ రీల్ వీడియో తెగ వైరల్ అవుతోంది. వాళ్లిద్దరు కలిసి ఈ రీల్ వీడియోలో వేసిన స్టెప్స్ మామూలుగా లేవు.. దీంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…