Siri Hanmanth: నా వల్లే షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ చెప్పాలనుకుంటే..! అది ఎప్పుడో జరిగేది..!
Siri Hanmanth: బిగ్ బాస్ రియాల్టీ షోలో మొత్తం 5 సీజన్లు పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం ఆరో సీజన్ కు సంబంధించిన పనులు కూడా సాగుతున్నాయి. కాకపోతే ఈ సారి ఓటీటీలో ప్రసారం చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇదంతా ఇలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసినా.. ట్రోలింగ్ ఆగడం లేదు. ముఖ్యంగా దీప్తి – షన్నూ వివాదం, సిరి- శ్రీహాన్ పై తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యం బిగ్ బాస్ పూర్తయినప్పటి నుంచి ఎక్కువగా నానుతున్న పేర్లు దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్. ఇప్పటికే దీప్తి సునయనా తాను షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పేస్తున్న అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి.. అందరికీ షాక్ ఇచ్చింది.
అయితే వాళ్లిద్దరు విడిపోవడానికి కారణం సరి వల్లే అంటూ నెటిజన్లతో పాటు.. షణ్ముఖ్, దీప్తి ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో సిరి- షన్నూల మధ్య రొమాన్స్ ఎక్కువ అవ్వడంతో ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది.
బిగ్ బాస్ విన్నర్ అవుతాడనుకున్న షణ్ముఖ్.. సిరి వివాదంతో ట్రోఫికీ దూరమయ్యాడు. ఈ ఇద్దరు హౌజ్ లో మితిమీరిన కిస్సింగ్, హగ్గింగులతో కాకపుట్టించారు. దీంతోనే షణ్ముఖ్ పరువు కూడా పోయిందని కొందరు ఆరోపిస్తున్నారు. తాజాగా వీటిన్నంటిపై సిరి స్పందించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకముందే తాను.. షణ్ముఖ్ మంచి ఫ్రెండ్స్ అని.. బిగ్బాస్ హౌస్ లోకి వెళ్లాక కూడా తాము స్నేహితులు లానే ఉన్నామని చెప్పింది. కాకపోతే.. కాస్త ఒంటిరి ఫీలింగ్ కావడంతో.. ఎమోషనల్ బాండింగ్ మాత్రమే ఏర్పడిందని చెప్పంది. దీప్తి సునయనా తనకు మంచి ఫ్రెండ్ అని చెబుతూ.. అమెతో పాటు నేను వర్క్ చేశాను అంటూ చెప్పింది. కానీ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఈ ట్రోలింగ్స్ చూసి తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయా అని.. దాని నుంచి బయటపడే లోపు దీప్తి బ్రేకప్ చెప్పడంతో నా మీద ఇంకా నెగెటివీటీ పెరిగిపోయింది అని చెప్పారు. బ్రేకప్ చెప్పుకునేంత బలహీనమైన ప్రేమ వాళ్లది కాదని.. నా వల్లే ఆ బ్రేకప్ జరిగి ఉంటే.. అది ఎప్పుడో జరిగేది అని చెప్పింది. ఇలా ఆమె మరోసారి..తన వల్ల బ్రేకప్ కాలేదు అని చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…