Featured

Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!

Singer Chinmayi: గాయని చిన్మయి గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆమె సింగింగ్ తో పాటు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేస్తుంది. అయితే ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటుంన్నారు. మొన్న హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను ఈమె తప్పుపడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సంగతి తెలిసిందే.

Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!

ఇలా ఆమె స్త్రీల సమస్యలపై ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతుంది. అలాగే సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు.. వారు ఎదుర్కొంటున్న బాధలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ సమాజంలో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో చిన్మయితో పలువురు మహిళలు తమకు ఎదురైన సమస్యలను చెప్పగా.. వారికి ఆమె సూచనలు, సలహాలను ఇస్తూ వస్తోంది. దీనిలో కూడా ఎలాంటి మానసిక సంఘర్షణలకు చోటు లేకుండా చిన్మయి సలహాలు ఇస్తుంటారు.

Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!

తాజాగా సింగర్ చిన్మయి తన ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో, హీరోయిన్‌ని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించినందుకు బాధితురాలికి పలువురు హీరోయిన్లు , సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు.

అయినా సినిమా అవకాశాలు రాలేదు..

వారిలో మలయాళ నటి పార్వతి తిరువోత్ కూడా ఒకరు. ఈ ఘటన తర్వాత పార్వతి పలు మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేసింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పోరాటం వల్ల తనకు సినిమా అవకాశాలు పోయాయని.. అంతకముందు తాను ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించానని.. అవి అన్నీ హిట్ అయ్యాయని.. అయినా సినిమా అవకాశాలు రాలేదని ఆమె చెప్పారు. ఆ పోరాటం వల్లే తనకు ఇలా జరిగిదంని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ.. అవకాశాలు రాలేదని.. అలాగే ఫైటింగ్ కూడా చేస్తూ.. హీరోయిన్ కు సపోర్ట్ చేసినందుకు తనను బెదిరించారని చెప్పింది. ప్రస్తుతం తాను రెండు సినిమాల్లోనే నటిస్తున్నానని చెప్పింది పార్వతి. ఈ విషయంపై గాయని చిన్మయి స్పందించింది. ‘‘పార్వతి లాంటి మంచి నటి నిజం చెప్పినందుకు సినిమా అవకాశాలు కోల్పోయింది. లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి పక్షాన మాట్లాడినందుకే అలాంటి నటికి ఈ పరిస్థితి ఏర్పడిందనేది నిజం. చాలామంది మహిళలు మౌనంగా ఉంటారు. ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది’’ అని చిన్మయి ట్వీట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, నటుడు దిలీప్ కుమార్ అరెస్టయి, బెయిల్‌పై తిరిగి వచ్చారు. జనవరి 18 వరకు అరెస్టు చేయరాదని కేరళ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago