కొత్తిమీర తింటే ఆ సమస్య కంట్రోల్.. ఎలా అంటే?

ఆకు కూరలలో ఒకటి కొత్తిమీరకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఏ కూర వండిన అందులో రెండు రెమ్మలు కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కొత్తిమీరని తమ బాల్కనీలో పెంచుకుంటూ ఉంటారు. కొత్తిమీరను తినటం వల్ల వంటకు కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం మనకు తెలిసిందే.తరచూ కొత్తిమీరను తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం…

  • రక్తపోటును నియంత్రించడం: అధిక రక్తపోటు వంటి సమస్యతో బాధపడే వారికి డాక్టర్లు కొతిమీర సలాడ్ తీసుకోమని సిఫార్సు చేస్తారు. ఇందులో ఉన్నటువంటి విటమిన్లు మన శరీరంలో రక్తాన్ని సరఫరా చేయడంలో దోహదపడతాయి. ఈ క్రమంలోనే అధిక రక్తపోటు హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది.
  • అజీర్తిని తగ్గిస్తుంది:
    తరచూ మన వంటలలో కొత్తిమీరను ఉపయోగించడం వల్ల మనలో ఏర్పడినటువంటి అజీర్తి, వాంతులు, వికారం వంటి సమస్యలను తగ్గిస్తాయి. కొత్తిమీర ఆకులలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను తొలగిస్తుంది.
  • కంటిచూపును మెరుగు పరుస్తుంది:
    కొత్తిమీరలో విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల తరచూ కొత్తిమీరను తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అదేవిధంగా రేచీకటి వంటి సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది.
  • బలమైన ఎముకలను ఇస్తుంది:
    ఆస్తియోపొరాసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని కొత్తిమీర తీసుకోమని చెబుతారు. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారందరూ ప్రతిరోజు కొత్తిమీర తీసుకోవడం వల్ల శరీరంలో ఎముకలు దృఢంగా తయారవుతాయి. కొత్తిమీరలో అధికభాగం క్యాల్షియం, ఇతర మినరల్స్ శరీరంలోని ఎముకలను దృఢంగా ఉంచడంలో దోహదపడతాయి.
  • నెలసరి నొప్పిని తగ్గిస్తుంది:
    ధనియాలలో ఎసోర్బిక్ యాసిడ్, పామిటిక్ ఆసిడ్, లైనోలిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి మన శరీరంలో హార్మోన్ల పనితీరును మెరుగు పరచడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి విముక్తిని కల్పిస్తాయి.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం వల్లనే డాక్టర్లు ఎక్కువగా కొత్తిమీరను తీసుకోవాలని సూచిస్తారు.