భారత దేశంలో కరోనా రెండో దశ ఏ విధంగా వ్యాప్తి చెందిందో మనకు తెలిసిందే. రోజురోజుకు కేసులో పెరుగుతుండడంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ విపత్కర పరిస్థితులలో నుంచి మన దేశాన్ని ఆదుకోవడం కోసం ఎంతోమంది తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటిస్తూ ఆక్సిజన్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశం ఈ సంక్షోభం నుంచి బయటకు రావాలని కొన్ని దేశాల ప్రజలు దేవుని ప్రార్థిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దేశంలో భారత దేశం కోసం ‘ఓం నమః శివాయః’ అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు.ప్రస్తుతం ఇండియాలో ఏర్పడిన ఈ విపత్కర పరిస్థితి నుంచి భారత ప్రజలను కాపాడాలని ఆ దేశంలోని ప్రజలు ప్రధాన కూడళ్ల వద్ద శివలింగాలను ఏర్పాటు చేసే పెద్ద ఎత్తున భారత దేశం కోసం ఓం నమ శివాయ అంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ అధికారి పవన్ కె పాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇటీవల ఈ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఇజ్రాయిల్ ప్రజలు ఓం నమ శివాయ అంటూ శివుని ప్రార్థించడం మనం చూడవచ్చు.ఈ మహమ్మారి నుంచి భారత ప్రజలను కాపాడాలని వీరు చేస్తున్న ప్రార్థనలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/COdefuNDmXq/?utm_source=ig_web_copy_link
ఈ వీడియో చూసిన భారతీయ నెటిజన్లు తమ దేశం కోసం ప్రార్థిస్తున్న ఇజ్రాయిల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీరు చేస్తున్న ఈ ప్రార్థనలు భారతదేశాన్ని ఈ సంక్షోభం నుంచి బయటపడేస్తాయని, ఈ ప్రార్థనలు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని, తొందరలోనే భారతదేశం ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…